కాలుష్య నియంత్రణకు..కంకణబద్ధ్దులమవుదాం


Mon,December 2, 2019 01:08 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కాలుష్యం.. ఇప్పడు అందరినీ ఆందోళన కలిగిస్తున్న అంశం. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న హెచ్చరిక.మన చుట్టూ పరిసరాలు, సహజమైన గాలిలోకి చేరేదంతా కాలుష్యమే. మనకు తెలియకుండా మనమే తెచ్చిపెట్టుకునే కాలుష్యం ఇప్పుడు మన భవిష్యత్తను సవాల్‌ చేస్తున్నది. వాహనాలనుంచి వెలువడే పొగలు, విషవాయువులు కార్ఖానాల నుంచి వెలువడే కాలుష్యం కంటే అత్యధిక ప్రమాదకరమైనది. మనకు మనంగా కొని తెచ్చుకునే కాలుష్యం మన ఆరోగ్యానికి ఎంతటి ముప్పును తెస్తుందో ఇప్పటికే చాలా మంది అనుభవిస్తూనే ఉన్నారు. కాలుష్య నియంత్రణ అనేది ఇప్పుడు అత్యవసరం. ప్రతి ఏటా డిసెంబర్‌ 2ను జాతీయ కాలుష్య నియంత్రణ దినంగా జరుపుకుంటున్నాం. భోపాల్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటన జరిగిన రోజును జాతీయ కాలుష్య నియంత్రణ దినంగా జరుపుకుంటున్నాం. కాలు ష్య నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఈ రోజును జరుపుకుంటున్నాం. కనుక బాధ్యత గల పౌరులుగా మనం కూడా కాలుష్య నియంత్రణకు కంకణబద్ధులమవుదామని ప్రతినబూనుదాం.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...