సాయిబాలాజీ హోమ్స్‌లో చోరీ: 18 తులాల బంగారం అపహరణ


Mon,December 2, 2019 01:07 AM

బడంగ్‌పేట నమస్తే తెలంగాణ: ఓ ఇంట్లో దొంగలు పడి బంగారం దోచుకెళ్ల్లిన సంఘటన మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బడంగ్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోని సాయిబాలాజీ హోమ్స్‌లో ఉంటున్న రవిశంకర్‌ గత నెల 27న కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి వెళ్లారు. డిసెంబర్‌ 1న ఉదయం 8 గంటలకు ఇంటికి వచ్చే సరికి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లో ఉన్న 18 తులా ల బంగారం అపహరించుకుపోయిన్నట్లు రవిశంకర్‌ మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీర్‌పేట పోలీసులు క్లూస్‌ టీమ్‌తో పరిశీలించారు. రవిశంకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నామని సీఐ యాదయ్య తెలిపారు.

కేపీహెచ్‌బీ కాలనీలో....
కేపీహెచ్‌బీ కాలనీ: ఓ ఇంట్లో దుండగులు చొరబడి బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లిన సంఘటన కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం... కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లోని ఎంఐజీ-88/5లో కృష్ణసాయిరాం దంపతులు నివసిస్తున్నారు. శనివా రం రాత్రి ఇంటికి తాళం వేసి మమత వైద్యశాలకు చికి త్స కోసం వెళ్లి ఆదివారం ఉదయం తిరిగొచ్చే సరికి ప్రధాన ద్వారం తెరిచి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చోరీ చేసినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఇంట్లోని బీరువాలో దాచిన 9 తులాల బంగారు ఆభరణాలు, ఐదువేల నగదు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...