ఖాళీ బాటిళ్లలో పెట్రోలు పోయొద్దు


Mon,December 2, 2019 01:06 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఖాళీ బాటిళ్లలో పెట్రోలు పోస్తే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్‌ పోలీసు స్పష్టం చేస్తున్నారు. ఇలా చేసే పెట్రోలు బంక్‌ సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈమేరకు శంషాబాద్‌ డీసీపీ జోన్‌ పరిధిలోని అన్ని పెట్రోలు బంక్‌లకు నోటీసులను జారీ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ఖాళీ బాటిళ్లతో వచ్చే వారి ఫోన్‌ నంబరు, పేరు, ఆచూకీ, వాహనం నంబరులు పెట్రోలు బంక్‌ సిబ్బంది సేకరించుకోవాలన్నారు. పెట్రోలు బంక్‌ సిబ్బంది స్మార్ట్‌ ఫోన్‌ ఉంటాయి కాబట్టి ఖాళీ బాటిళ్లతో పెట్రోలు కోసం వచ్చే వారి ఫోటోను తీసుకుని పెట్టుకోవచ్చు. ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు దృష్ట్యా ఈ విషయాలను ప్రతి పెట్రోలు బంక్‌ సిబ్బంది, యాజమాన్యం పాటించాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై బంక్‌ యజమానులు, నిర్వాహకులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఖాళీ బాటిళ్లలో పెట్రోలు పోయవద్దని తెలియజేస్తామని డీసీపీ ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...