24 నుంచి జిల్లా స్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీలు


Fri,November 22, 2019 01:40 AM

చందానగర్‌, (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మాస్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 24న చందానగర్‌ పీజేఆర్‌ స్టేడియంలో రంగారెడ్డి జిల్లా స్థాయి అథ్లెటిక్‌ పోటీలను నిర్వహించనున్నట్టు అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కొండా విజయ్‌కుమార్‌ తెలిపారు. చందానగర్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధానకార్యదర్శి నూనె సురేందర్‌తో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. మాస్టర్స్‌ అథ్లెటిక్‌ పోటీల్లో 35 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయస్సు వారు పాల్గొనవచ్చని తెలిపారు. రన్నింగ్‌, జంపింగ్‌, త్రోబాల్‌, వాకింగ్‌, హడిల్స్‌ తదితర క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయని, విజేతలకు బహుమతుల ప్రదానం ఉంటుందన్నా రు. అదేవిధంగా జిల్లా స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి వచ్చేనెలలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని అన్నారు. ఔత్సాహిక క్రీడాకారులు ఫోన్‌నంబర్‌: 9394868993లో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు చిరంజీవులు, ప్రతినిధులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌ముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...