ఘనంగా ఇండివుడ్‌ బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అవార్డుల ప్రదానోత్సవం


Fri,November 22, 2019 01:35 AM

మాదాపూర్‌: మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఐబీసీ ఇండివుడ్‌ బిలీనియర్స్‌ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ఇండివుడ్‌ బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అవార్డు 2019 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ విచ్చేసి వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను అందజేశారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 27 మందిని ఎంపిక చేసి ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో మొదటి అవార్డు ప్రసాద్‌ స్టూడియో వ్యవ స్థాపకుడు రమేష్‌ ప్రసాద్‌ను వరించిన అనంతరం గ్రీన్‌ గోల్డ్‌ యానిమేషన్‌ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ రాజీవ్‌ చిలకా, రోటోమేకర్‌, స్మైలీ కిడ్డోస్‌ సీసీఓ మాదవరెడ్డి, జీవికే వ్యవస్థాపకుడు, డైరెక్టర్‌ కృష్ణారెడ్డి, ఏసియన్‌ సినిమాస్‌ సీఈఓ సునీల్‌ నారంగ్‌లతో పాటు తదితరులను ఈ అవార్డు వరించింది. ఇందులో భారతీయ సంపన్నులతో పాటు వివిధ వ్యాపారాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles