చెస్‌ క్రీడా వ్యాపారాన్ని అరికట్టాలి


Thu,November 21, 2019 12:20 AM

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి : గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో జరుగుతున్న చెస్‌ క్రీడా వ్యాపారాన్ని అరికట్టాలని హైదరాబాద్‌ యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర క్రీడలు యువజన, ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌, తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.దినకర్‌బాబులకు వినతి పత్రం అందజేశారు. లాల్‌బహదూర్‌ స్టేడియంలోని స్పోర్ట్స్‌ అథారిటీ కార్యాలయంలో బుధవారం హైదరాబాద్‌ యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎల్‌.అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ చెస్‌ పోటీలను ప్రతి శని, ఆదివారాల్లో నిర్వహిస్తూ పిల్లల తల్లిదండ్రుల నుంచి రూ.300 నుంచి 3వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అసోసియేషన్ల కార్యదర్శుల అండదండలతో శని, ఆదివారాల్లో ఆరు సంవత్సరాల నుంచి 8, 10, 12, 14, 16 ఏండ్ల వయస్సుగల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తూ వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. క్రీడలతో చేస్తున్న వ్యాపారాన్ని అడ్డుకోవాలని కోరారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles