కోరుకొండ సంకల్పం..కృషితో చేయూత


Wed,November 20, 2019 12:57 AM


-వీధి బాలలు, అన్నార్థులను అక్కున చేర్చుకుంటున్న కృషిహోం
-విద్యాబుద్ధులు నేర్పి జీవితానికి దారి
-కోరుకొండ సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థుల విశిష్ట సేవ
-సైకోరియన్ అసోసియేషన్‌లో 2000 మంది సభ్యులు
-దాతల సహకారంతో.. 25 వసంతాలు పూర్తి చేసుకున్న ఆశ్రమం
మేడ్చల్ రూరల్ : విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు సమాజ సేవకు కదలాలన్న సంకల్పంతో 1992లో సైకోరియన్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనాథ పిల్లలను ఆదుకోవాలని నిర్ణయించారు. దాతల కోసం ఎదురుచూడకుండా సొంతంగా నిధులను సమకూర్చుకొని 1994లో ప్రాజెక్టును చేపట్టారు. ఏడుగురు విద్యార్థులతో బేగంపేటలో కృషిహోం పేరుతో అనాథ ఆశ్రమాన్ని ప్రారంభించారు. కొంత కాలం అక్కడే అద్దె గృహంలో ఆశ్రమాన్ని నడిపించారు.

12 ఏండ్లలోపు బాలురకు ప్రవేశం
అనాథలు, అమ్మా లేదా నాన్న ఒకరు మాత్రమే ఉండి ఆర్థిక పరిస్థితి, కుటుంబ సమస్యలతో బాధపడే వారిని ఆశ్రమంలో చేర్చుకుంటారు. 6 నుంచి 12 ఏండ్లలోపు వారిని మాత్రమే తీసుకొని, వసతితో పాటు విద్యనందిస్తారు. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి అవసరమైన జీవన నైపుణ్యాలను నేర్పుతున్నారు. క్రమశిక్షణతో పాటు ప్రేమగా అనాథలను ఆదరిస్తుండడం, ఓపికతో జీవితంలో తమకాళ్ల మీద తాము నిలబడేలా చేయూతనిస్తున్నారు. 10వ తరగతి తర్వాత వృత్తివిద్యా కోర్సుల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. ఇంట్లో నుంచి పారిపోయి దారితెన్నులు తెలియకుండా రోడ్లు, రైల్వేస్టేషన్లలో తిరుగుతున్న ఎంతో మంది ఆశ్రమంలో చేరి, ప్రస్తుతం ఉన్నత జీవితాన్ని అనుభవిస్తున్నారు. 25 ఏండ్లలో దాదాపు 800 మంది వరకు ఆశ్రమానికి చెందిన విద్యార్థులు జీవితంలో స్థిరపడి, ఉత్తమ పౌరులుగా జీవిస్తున్నారు. పెండ్లి చేసుకొని కుటుంబంతో ఆనంద జీవితాన్ని అనుభవిస్తున్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...