ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి


Wed,November 20, 2019 12:55 AM

హిమాయత్‌నగర్: నగరంలోని ప్రతి ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో పిల్లల భద్రత కోసం తప్పనిసరిగా ఒక మహిళా అటెండర్ ఉండే విధంగా స్కూల్ యాజమాన్యాలు చర్యలు తీసు కోవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. ఈ విషయంపై నగరంలోని అన్ని విద్యాసంస్థల యాజమానులకు లేఖలు రాస్తామని తెలిపారు. మంగళవారం హైదర్‌గూడలోని సెయింట్ పాల్స్ హైస్కూల్‌లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అంజనీకుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యూనిఫాం లేని పోలీసులేనని, మేం యూనిఫాం వేసుకుని సేవ చేస్తుంటే మీరం తా యూనిఫాం లేకుండా సేవలను అందించాలన్నారు. విద్యార్థులే దేశ భవిష్యత్‌కు పునాదులని, నవ సమాజ నిర్మాణంలో వీరి పాత్ర కీలకమన్నారు. కొంత కాలం నుంచి పాఠశాలల్లో విద్యార్థులకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పిస్తున్నామని, ఇది నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. ఇంట్లో తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఎవరైనా ట్రాఫిక్ నియమాలు పాటించకుంటే మీరే వారికి తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. బైక్‌పై వెళ్తున్నక్రమంలో తప్పనిసరిగ్గా హెల్మెట్ పెట్టుకోవాలని, కార్లలో ప్రయాణించే సమయంలో సీటు బెల్టు పెట్టుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, మైనర్లకువాహనాలను ఇవ్వకుండాతల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. మైనర్లు వాహనాలు నడిపేతే వారి తల్లిదండ్రులతోపాటు వాహనాలను నడిపే వారికి శిక్షలు ఉంటాయన్నారు. రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాలు జరుగకుండా ప్రతి పౌరుడు చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్‌కుమార్, ట్రాఫిక్ డీసీపీ చౌహాన్, అడిషనల్ డీసీపీ పి.కరుణాకర్, జగన్నాథ్‌రెడ్డి, సెయింట్ పాల్స్ స్కూల్ ప్రిన్సిపాల్ రాయప్పరెడ్డి,నారాయణగూడ ట్రాఫిక్ సీఐ చంద్రమోహన్, ఎస్‌ఐ కృష్ణంరాజు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...