పౌరుల సమన్వయంతోనే నేరాల నియంత్రణ


Wed,November 20, 2019 12:55 AM

కంటోన్మెంట్, నమస్తే తెలంగాణ: నేరాల నియంత్రణతోపాటు ఉద్యోగ కల్పనలోనూ నగర పోలీస్ ముందంజలో ఉంటుందని పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. నార్త్‌జోన్ కార్ఖానా పోలీస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ పేరిట మంగళవారం సికింద్రాబాద్‌లోని వైశ్రాయ్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజనీకుమార్ మాట్లాడుతూ.. పోలీస్‌కు 200 ఏళ్ల చరిత్ర ఉంది. గతంలో పోలీస్ వ్యవహారశైలి వేరని, తాజా పోలీస్ విధీవిధానంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. పోలీసులు, పౌరు ల సమన్వయంతోనే నగరంలో నేరాలు ఘననీయంగా తగ్గినట్లు తెలిపారు.నేషనల్ క్రైం బ్యూర్ నివేదిక ప్రకారం దేశంలో హైదరాబాద్‌కు సురక్షితంగా ప్రాంతంగా స్థానం దక్కిందన్నారు. ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు మన నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూకడుతన్నట్లు సీపీ వెల్లడించారు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ఈ యాప్ ద్వారా కేవలం నార్త్‌జోన్ పరిధిలో 13,500మంది సీనియర్ సిటిజన్లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆ యాప్‌లో రకరకాల అప్షన్లు ఉన్నట్లు పేర్కొన్నారు. సర్వేం ట్, టేనెంట్‌లతోపాటు వ్యక్తిగత విషయాలపై సీనియర్ సిటిజన్లు యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నట్లు వివరించారు. పోలీస్ విధుల్లో అనేక నూతన సంస్కరణలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మొబైల్ స్మార్ట్ ఫోన్‌లలో ఆరు నెలలకోక కొత్త యాప్‌ను ప్రవేశపెట్టినట్లుగా, పోలీసుల సైతం ప్రజల క్షేమం అనేక యాప్‌లను అందుబాటులోకి తెస్తుందన్నారు. ప్రతిరోజు 100 డయల్‌కు 400 నుంచి 500 కాల్స్ వస్తున్నాయని, కాల్స్ వచ్చిన క్షణాల్లోనే పెట్రోలింగ్ కార్లు ఘటన స్థలానికి చేరుకుంటున్నాయని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని సేఫ్ అండ్ సెక్యూరిటీ సిటీగా నిలిపేందుకు పోలీస్ విభాగం అహర్నిశలు శ్రమిస్తుందన్నారు.

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లయితే నేరాల బాట పట్టే అవకాశం ఉండదన్నారు. ఇందులోభాగంగానే నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు జాబ్ కనెక్ట్‌ను నిర్వహించినట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ఎండీ లచ్చిరామ్ నాయక్ మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం ఎస్సీ కార్పొరేషన్ అనేక కార్యక్రమాలను చేపడుతుందని, అందుకోసం నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాల గ్రూపు మహిళలకు ఉచితం గా శిక్షణ ఇప్పించి, బ్యాంక్ రుణాలను ఇప్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 5 మురికి వాడలను ఎంపిక చేసి, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఇంటింట సర్వే ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ కల్మేశ్వర్ సింగనార్, ఎస్సీ కార్పొరేషన్ జాయింట్ డైరెక్టర్ హన్మంత్‌నాయక్, నార్త్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ అర్.బి.రంగ య్య , గోపాలపురం, బేగంపేట ఏసీపీలు వెంకటరమణ, నరేశ్‌రెడ్డి, కార్ఖానా ఇన్‌స్పెక్టర్ మధుకర్‌స్వామి పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...