అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి


Tue,November 19, 2019 03:05 AM

సిటీబ్యూరోషనమస్తే తెలంగాణ: వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు, చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా స్వైన్‌ఫ్లూ వంటి అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి డా.వెంకటి అధికారులకు, ప్రజలకు సూచించారు. జిల్లా పరిధిలోని బస్తీ దవాఖానలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు, ఏరియా దవాఖానలు, జిల్లా దవాఖానతో పాటు గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌, నల్లకుంట ఫీవర్‌ హాస్పిటల్‌ తదితర దవాఖానల్లో వైద్యపరీక్షల
సౌకర్యాన్ని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. చలికాలంలో ముఖ్యంగా స్వైన్‌ఫ్లూ, వైరల్‌ ఫీవర్స్‌తోపాటు ముఖ్యంగా పిల్లలో నిమోనియా తదిత ర వ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో వైద్యపరీక్షలతోపాటు మందులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

నగరంలో మొత్తం 82 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 14 ఏరియా హాస్పిటల్స్‌, 64 బస్తీ దవాఖానలతోపాటు ఉస్మానియా, గాంధీ వంటి సూపర్‌ స్పెషాలిటీ దవాఖానల్లో అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. స్వైన్‌ఫ్లూకు సంబంధించి గాంధీ నోడల్‌ కేంద్రంగా ఏర్పాటు చేయడంతోపాటు పిల్లలకు ప్రత్యేకంగా నిలోఫర్‌ దవాఖానలో ఐసోలెటెడ్‌ వార్డును ఏర్పాటు చేశామని, నల్లకుంట ఫీవర్‌ హాస్పిటల్‌లో సైతం బాధితులకు చికిత్స అందించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...