మిస్‌ దివాకు సై..!!


Tue,November 19, 2019 03:02 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : దేశ వ్యాప్తంగా జరుగుతున్న ‘మిస్‌ దివా-2019’ అందాల పోటీలకు ఆడిషన్స్‌ ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే గచ్చిబౌలిలోని హయత్‌హోటల్‌లో ఆడిషన్స్‌ నిర్వహించారు. పాల్గొన్న 70 మందిలో నగరానికి చెందిన తొమ్మిది మంది యువతులు ఎంపిక అయ్యారు. ర్యాంప్‌వాక్‌ చేస్తూ హోయలు పోయారు. అందం..అభినయం..సామాజిక అంశాలపై చర్చలు.. తదితర వాటిలో జడ్జీలను ఆకట్టుకున్నారు. నగరానికి చెందిన భవనాసిర్ప(22), సాయిలక్ష్మి కసినబోయిన(25), ముధుశ్రీ గుప్తా(26), బెల్ల లొలగె(21), హర్షిత శర్మ(18), శ్రీసాయిరెడ్డి(21), సౌందర్య(23), తరుణ చౌదరీ(24), ఐశ్వర్య(21) ఎంపికయ్యారు. 2014లో రష్యాలో జరిగిన మిసెస్‌ ప్లానెట్‌ విజేత మహేకవితా మూర్తి జడ్జీగా వ్యవహరించారు. వచ్చే ఏడాది జరుగబోయే మిస్‌ దివా అందాల పోటీల్లో ఈ బామలు పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...