పార్కింగ్ చిక్కులకు చెక్


Mon,November 18, 2019 04:58 AM

-అత్యంత సౌకర్యవంతంగా.. నగర వ్యాప్తంగా 47 చోట్ల మెట్రో పార్కింగ్ స్టేషన్లు
- మొదటగా నాంపల్లిలో బహుళ అంతస్తుల్లో నిర్మాణం
-పార్కింగ్‌తో పాటు షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్
- యాప్ ద్వారానే స్లాట్ బుకింగ్
-మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మెట్రో ఎండీ ప్రణాళికలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :నగరంలో ట్రాఫిక్ రద్దీతోపాటు పెరుగుతున్న పార్కింగ్ సమస్యకు హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు మంగళం పాడనున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలను వేగవంతం చేసింది. నగరం ట్రాఫిక్ క్రమేపీ పెరుగుతున్న క్రమంలో వాహనాలు నిలుపడానికి స్థలం లేక పార్కింగ్‌కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి నగర వ్యాప్తంగా 47 కార్‌పార్కింగ్ మల్టీలెవెల్ పార్కింగ్ స్టేషన్లు నిర్మించడానికి ప్రణాళికలు చేపట్టారు. మొదటి మల్టీలెవెల్ పార్కింగ్ స్టేషన్‌ను నాంపల్లిలో నిర్మిస్తున్నారు. పనులు చకచకా జరుగుతున్నాయి. బహుళ అంతస్తుల్లో నిర్మించనున్న మల్టీలెవెల్ కార్‌పార్కింగ్ నిర్మాణాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి ఏర్పాట్లు చేయనున్నారు. నిర్వహణ ఖర్చులన్నింటినీ మల్టీలెవల్ కార్‌పార్కింగ్ ద్వారా వచ్చే ఆదాయం నుంచే తీసుకోవాలని నిర్ణయించారు. వీటితోపాటు మెట్రోస్టేషన్లలో ఏర్పాటు చేసిన స్మార్ట్ పార్కింగ్ విధానం కూడా నగర ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. యాప్‌ద్వారా మెట్రోస్టేషన్లలో ఉండే పార్కింగ్ జోన్‌లోని స్లాట్‌ను బుక్‌చేసుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు విధానాన్ని మరింత మెరుగుపర్చడంలో భాగంగా పార్కింగ్ వ్యవస్థను అభివృద్ధి పరిచి ట్రాఫిక్‌ను తగ్గిస్తున్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...