యువత క్రీడల్లో రాణించాలి


Mon,November 18, 2019 04:49 AM

మలక్‌పేట: చదువుతో పాటు యువత క్రీడల్లో రాణించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. భాగ్యనగర్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సహకారంతో మూసారాంబాగ్ యూత్ బ్రిగేడ్ ఆధ్వర్యంలో బాలదానమ్మ బస్తీ కమ్యూనిటీహాల్ ప్రాంగణంలో నిర్వహించిన మిస్టర్ హైదరాబాద్ ఓపెన్ బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్-2019 పోటీల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసారాంబాగ్ యూత్ బ్రిగేడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాడీ బిల్డింగ్ పోటీలు యువతకు స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. నేడు మిస్టర్ హైదరాబాద్, ఆ తర్వాత మిస్టర్ ఇండియా, మిస్టర్స్ యూనివర్స్‌గా ఎదిగేందుకు ఎంతో దోహదపడతాయన్నారు. విలువైన కాలాన్ని వృథా చేసుకోకుండా క్రమశిక్షణ, పట్టుదలతో గొప్ప స్థాయికి ఎదగాలని సూచించారు. పిన్న వయసులో ఇంతపెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన గాజుల శివప్రసాద్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఎనిమిది క్యాటగిరీల్లో (బిలో 55, 60, 65, 70, 75, 80, 85, ఎబౌ 90) నిర్వహించిన ఈ పోటీల్లో జంట నగరాల నుంచి 67 మంది బాడీ బిల్డర్లు పాల్గొన్నారు. ఈ పోటీల్లో మిస్టర్ హైదరాబాద్ బాడీ బిల్డర్ చాంపియన్‌గా మొగల్పూరాకు చెందిన హాసన్ అలీ గెలుపొందారు.

విజేతకు రూ.20వేల నగదు బహుమతితోపాటు మెమోంటో,ప్రశంసాపత్రాన్ని అందజేయగా, నాయకుడు పొలం రవీందర్‌యాదవ్ ప్రోత్సాహక బహుమతిగా రూ.2వేలు అందజేసి అభినందించారు. హైదరాబాద్ ఓపెన్ బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్-2019 పోటీలకు జాతీయ న్యాయనిర్ణేతలుగా భాగ్యనగర్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు జి,విజయ్‌నేత, కార్య నిర్వాహక కార్యదర్శి వైవి.రవిప్రకాష్, రైల్వే బిల్డర్ కోచ్‌లు సంజీవ్, దేవేందర్‌యాదవ్, రవీందర్‌రెడ్డి, రవీందర్‌లు వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు. అన్ని క్యాటగిరీల్లో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజేతలను ఎంపికచేసి మెమోంటో, ప్రశంసాపత్రాలను అందజేశారు.కార్యక్రమానికి మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, కార్పొరేటర్ తీగల సునరితా అజిత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు వెంకటేశ్‌గౌడ్, బీజేపీ గ్రేటర్ కార్యదర్శి దేవేందర్, నగర కార్యవర్గ సభ్యుడు రమేశ్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రవీందర్‌యాదవ్, ఇలియాస్‌లు మఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో మూసారాంబాగ్ యూత్ బ్రిగేడ్ కో ఆర్గనైజర్లు రంజిత్, బాబ్జి, బాలకిషన్, బాల్‌రాజ్, బల్వంత్, రియాజ్, రహీం, శివప్రసాద్‌గౌడ్ పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...