మురుగు శుద్ధీకరణ


Mon,October 21, 2019 12:12 AM

-వినియోగంలోకి మురుగునీరు
-శుద్ధి చేసి రూ.60కే ట్యాంకర్
-తొలుత హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పార్కులు, గార్డెన్‌లకు..
-ప్రభుత్వ, నిర్మాణ రంగ సంస్థలకు జలమండలి లేఖలు
-సమన్వయ సమావేశంలో నిర్ణయం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : శుద్ధి చేసిన మురుగునీరు వాడకంలోకి రానున్నది. నిత్యం 750 ఎంఎల్‌డీల మేర వృథాగా పోయే నీటిని శుద్ధ్ది చేసిన తర్వాత తాగడానికి మినహాయిస్తే ఇతర అవసరాలకు వినియోగించాలని జలమండలి అధికారులు నిర్ణయించారు. శుద్ధ్ది అయిన మురుగును పార్కులు, గార్డెనింగ్, ప్రభుత్వ రంగ సంస్థలకు, నిర్మాణ రంగానికి, రైల్వే, పరిశ్రమలకు ఈ నీటిని విరివిగా వినియోగించవచ్చని అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే మురుగునీటిని పునర్వినియోగం దిశగా కసరత్తు పూర్తి చేశారు. మురుగునీటి శుద్ధికేంద్రాలు (ఎస్టీపీ)లకు ఐదు కిలోమీటర్ల మేర పరిధిలో ఈ శుద్ధి చేసిన నీటిని ట్యాంకర్ ద్వారా సరఫరా చేయనున్నారు. ఈ మేరకు ఒక్కో ట్యాంకర్‌ను రూ.60లకు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. తొలుత జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పార్కులు, గార్డెనింగ్‌లకు శుద్ధ్ది చేసిన నీటిని అందించనున్నారు. ఇదే సమయంలో శుద్ధ్ది చేసిన నీటిని వాడుకోవాలంటూ ప్రభుత్వ రంగ సంస్థలు, నిర్మాణ రంగ సంస్థలకు లేఖలు రాస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ పార్కులన్నింటిలోనూ శుద్ధి చేసిన నీటినే వాడాలంటూ రెండు రోజుల క్రితం జరిగిన సమన్వయ సమావేశంలోనూ తీర్మానం చేయడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ ప్రస్తుతం దాదాపు 1700 ఎంఎల్‌డీల మురుగు నీరు బయటకు వస్త్తుంది ఇందులో అంబర్‌పేట ( 339), నాగోల్ (172), నల్లచెరువు (30) ట్రీట్‌మెంట్ ఫ్లాంట్‌ల ద్వారా నిత్యం కేవలం 750 ఎంఎల్‌డీల మురుగును శుద్ధ్ది చేస్తున్నారు. మిగిలిన నీటిని శుద్ధి జరుగకుండానే నేరుగా మూసీలోకి వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే నీటిని పునర్వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించారు. శుద్ధి అయిన మురుగునీటిని తిరిగి వాడకంలోకి తీసుకువచ్చి తక్కువ ధర కింద భారీ నివాస సముదాయాల్లో, గార్డెనింగ్, బాత్‌రూమ్‌ల్లో , రైల్వే, పరిశ్రమలకు ఆ నీటిని విరివిగా వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకు ముందు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పార్కులలో ఖచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...