పద్మశాలీ న్యాయవాదుల సమ్మేళనం


Mon,October 21, 2019 12:09 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను సాధించేందుకు పద్మశాలీ కులస్తులందరూ సంఘటితంగా కృషిచేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ పరీక్షల కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ పిలుపునిచ్చారు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన బాపూజీ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే శ్వాసగా పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ పద్మశాలీ న్యాయవాదుల సంక్షేమ సంఘం (పీఏడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో ఆదివారం నారాయణగూడలోని పద్మశాలీ హాస్టల్ సమావేశ మందిరంలో దసరా, దీపావళి సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చట్టసభల్లో పద్మశాలీల సంఖ్య పెరిగినప్పుడే మన అభివృద్ధి సాధ్యమని, ఆ దిశగా మనమంతా కృషిచేయాలన్నారు. సమావేశంలో బార్ కౌన్సిల్ సభ్యులు దుస్స జనార్దన్, బీ. శంకర్‌తోపాటు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్, పీఏడబ్ల్యూఏ అధ్యక్షుడు రాపో లు సత్యనారాయణ, కార్యదర్శి గంజి యాదగిరి, వనం విశ్వనాథ్, ఆలే నగేశ్, కందగట్ల స్వామి, రవీందర్, శివానంద్ తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...