మూడు ప్రపంచ రికార్డులు నెలకొల్పిన చిన్నారి


Mon,October 21, 2019 12:08 AM

కవాడిగూడ: ఎలైట్ వరల్డ్ రికార్డుల ప్రతినిధులు, న్యాయనిర్ణేతల సమక్షంలో ఆరేళ్ల చిన్నారి సహృద మూడు ప్రపంచ రికార్డులను తిరగరాసింది. పీవీబీఆర్‌శర్మ, పీఎస్‌వీ శైలజ కూతురు పీడీవీ సహృద గీతాంజలి హైస్కూల్‌లో మూడోతరగతి చదువుతోంది. హోటల్ మారియట్‌లో ప్రపంచ రికార్డుల కోసం ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారి సహృద గంట వ్యవధిలోనే పేపర్‌తో అత్యధికంగా వివిధ రకాల బొమ్మలను రూపొందించింది. అనంతరం అత్యధిక సిరామిక్ టైల్స్‌ను 20 నిమిషాల్లో చేతులతో పగులగొట్టింది. తర్వాత ఐదు గంటలపాటు నిరంతరాయంగా రంగులతో చిత్రాలు వేసి రికార్డు సృష్టించిందని ఎలైట్ వరల్డ్ రికార్డు న్యాయనిర్ణేత అమిత్ హింగోరాణి ప్రకటించారు. కార్యక్రమంలో యమునా పాఠక్, ఎన్.ఎస్.గణేశ్, అశ్విన్‌ఆనంద్, వేదకుమారి తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...