ప్రతిఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి


Mon,October 21, 2019 12:07 AM

శేరిలింగంపల్లి: ప్రతిఒక్కరూ ట్రాఫిక్‌రూల్స్‌ను పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడి యం నుంచి ట్రిపుల్ ఐటీ ట్రాఫిక్ సిగ్నల్ మీదు గా తిరిగి స్టేడియం వరకు వాకథాన్ నిర్వహించారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సి ల్(ఎస్‌సీఎస్‌సీ), సైబరాబాద్ పోలీసుల సంయు క్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సీపీ సజ్జనార్‌తోపాటు పలువురు పోలీసు అధికారులు, ఎస్‌సీఎస్‌సీ ప్రతినిధులు పాల్గొని రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ వాకథాన్‌ను జెండాఊపి ప్రారంభించిన అనంతరం సీపీ సజ్జనార్ మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటి స్తూ వాహనాలను నడిపితే ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవచ్చని తెలిపారు.

సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మాదాపూర్ లా అండ్ ఆర్డర్ డీసీపీ వెంకటేశ్వర్ రావు, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, ఏసీపీ చంద్రశేఖర్, ఎస్‌సీఎస్‌సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల, ట్రాఫిక్ ఫోరం జాయింట్ సెక్రటరీ వెం కట్ టంకశాల, ఐటీ ఉద్యోగుల పాల్గొన్నారు. అంతకుముందు వాహనదారులు, అధికారుల తో టాఫిక్ రూల్స్‌ను పాటిస్తామని సీపీ సజ్జనార్ ప్రతిజ్ఞ చేయించారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...