కూలిన వందేండ్ల భవనం ..


Sun,October 20, 2019 03:24 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/ తెలుగుయూనివర్సిటీ: నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని హెరిటేజ్ భవనం నాంపల్లి సరాయిలోని ఒక భాగం శనివారం సాయంత్రం కుప్పకూలింది. సమాచారం అందుకున్న వెంటనే జీహెచ్‌ఎంసీకి చెందిన డిజాస్టర్ రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. డీఆర్‌ఎఫ్‌కు చెందిన రెండు ప్రత్యేక బృందాలు జేసీబీతో అక్కడికి చేరుకొని కూలిన శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టాయి. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. దాదాపు వంద సంవత్సరాల చరిత్రగల ఈ నాంపల్లి సరాయి విశ్రాంతి భవనం ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 1919లో 5828 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి వచ్చే ప్రయాణికులతోపాటు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చేవారి సౌకర్యార్థం అప్పట్లో దీన్ని నిర్మించారు. 2011లో దీన్ని హెరిటేజ్ భవనంగా ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ ద్వారా అందజేస్తున్న రూ. ఐదు అన్నపూర్ణ భోజన పథకాన్ని మొదటిసారి ఈ భవనం నుంచే ప్రారంభించడం విశేషం. ఈ భవనం చుట్టూ ఉన్న భవనాలు కూడా పురాతన భవనాలే కావడంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది వాటికి నష్టం జరుగకుండా అప్రమత్తంగా శిథిలాల తొలగింపు చర్యలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...