ఒకేచోట మూడు మతాల శ్మశాన వాటికలకు బల్దియా సన్నాహాలు


Sun,October 20, 2019 03:24 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఫతుల్లాగూడలోని పాత వ్యర్థాల డంపింగ్‌యార్డు స్థలంలో హిం దూ, ముస్లిం, ్రక్రైస్తవుల మతాలకు చెందిన మూడు శ్మశాన వాటికలను ఏర్పాటుచేసేందుకు జీహెచ్‌ఎంసీ సన్నాహాలు చేస్త్తుంది. హిందూ శ్మశాన వాటికలో అత్యాధునిక విద్యుత్ దహన వాటికను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దీనికి తాజాగా స్థాయీసంఘం ఆమోదం తెలపడంతో బల్దియా అధికారులు తదుపరి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫతుల్లాగూడ, శంషిగూడ, గంధంగూడ పరిధిలోని 45.76 ఎకరాల స్థలంలో గతంలో నగర వ్యర్థాల డంపింగ్‌యార్డు నిర్వహించారు. చుట్టూ నివాసాలు ఏర్పడడంతో దాన్ని మూసివేసి ఆ స్థలాన్ని పునరుద్ధరించేందుకు హెచ్‌ఐఎంఎస్‌డబ్ల్యూ అనే సంస్థకు 2012లో అప్పగించారు. అందులో రెండు ఎకరాల్లో బీటీ ప్లాంటు ఏర్పాటుచేయగా, కుక్కలు, కోతుల పాండ్‌ను ఐదు ఎకరాల్లో ఏర్పాటుచేశారు. ఓల్డ్ డంప్‌సైట్ క్యాపింగ్ పనులు 5.5ఎకరాల్లో చేపట్టాగా, నిర్మాణ వ్యర్థాల ప్లాంటు ఏర్పాటుకు 10ఎకరాలు కేటాయించారు. ఇంకా 23.26ఎకరాల స్థలం మిగిలివుంది. అందులో హిందూ, ముస్లిం, క్రైస్తవుల మతాలకు చెరి రెండు ఎకరాల చొప్పున కేటాయించారు. కాగా, కాలుష్యం ఏర్పడకుండా ఉండేందుకు హిందూ శ్మశాన వాటికలో అత్యాధునిక విద్యుత్ దహనవాటికను ఏర్పాటుచేయాలని స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి జీహెచ్‌ఎంసీని కోరారు. మూడు శ్మశానవాటికల చుట్టూ కాంపౌండ్‌వాల్ నిర్మించడంతోపాటు నీటికోసం మూడు బోర్లను ఏర్పాటు చేయాలని, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరుతూ జీహెచ్‌ఎంసీకి ఆయన లేఖ రాశారు.

దీంతో అధికారులు అత్యాధునిక విద్యుత్ దహనవాటికను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. గత శుక్రవారం జరిగిన బల్దియా స్థాయీసంఘంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేసి తదుపరి చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఒకే ప్రాంతంలో మూడు మతాలకు చెందిన శ్మశానవాటికలను పక్కపక్కనే ఏర్పాటుచేయనున్నట్లు అధికారులు తెలిపారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...