పలు ప్రాంతాల్లో ఫిర్యాదు బాక్సులు


Sun,October 20, 2019 03:23 AM

బన్సీలాల్‌పేట్, అక్టోబర్ 19 : ప్రజలు తమ సమస్యలను తెలియజేసేందుకు పలు ప్రాంతాల్లో ఫిర్యాదు బాక్స్‌లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పద్మారావునగర్ ప్రాంతంలోని కాలనీలు, అపార్ట్‌మెంట్‌ల్లో నివసించే ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి తొలిసారిగా శనివారం పద్మారావునగర్ సంక్షేమ సంఘం, వాకర్స్, సీనియర్ సిటిజెన్స్‌ల ఆధ్వర్యంలో ప్రజలతో ముఖాముఖిని నిర్వహించారు. పద్మారావునగర్‌లోని కౌతా కామకోటి కల్యాణ నిలయంలో జరిగిన ఈ ముఖాముఖిలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, జలమండలి ఎం.డీ. దానకిశోర్, హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ జి.రవి,జోనల్ కమిషనర్ శంకరయ్య, కార్పొరేటర్ కే.హేమలత, బేగంపేట్ డీసీ నళిని పద్మావతి, తహసీల్దార్ జయమ్మ, షర్మిల, ఏసీపీలు శ్రీనివాస్‌రావు, వెంకటరమణ, పలు ప్రభుత్వ విభాగాల అధికారులతో కలిసి మంత్రి తలసాని అపార్ట్‌మెంట్లు, కాలనీలకు చెందిన ప్రతినిధులు హాజరై చెప్పిన సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించడానికి కృషి చేశారు.

ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలాంటి ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు అధికారులతో పున: సమీక్ష జరుగుతుందన్నారు. ఎస్‌పీ కాలేజీ రోడ్డు, వెంకటాపురం కాలనీల్లో రోడ్లపై అక్రమంగా పార్కింగ్ చేస్తున్న వాహనాలను వెంటనే తొలగించాలని, వాహన యజమానులతో కఠినంగా వ్యవహరించాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. శనివారం, గురువారం నిర్వహించే కూరగాయల సంత వల్ల నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యలకు పోలీస్, టౌన్‌ప్లానింగ్ అధికారులు సమన్వయంతో పరిష్కార మార్గాలను చూడాలని సూచించారు. బోయిగూడలో నివాసాల నడుమ ఎల్‌పీజీ పెట్రోల్ బంక్ నిర్మిస్తున్నారని ప్రజలు ఫిర్యాదు చేయగా, బంక్ అనుమతులను వెంటనే రద్దు చేయాలని మంత్రి ఆదేశించారు.

వాహనాల వేగం పెరిగిందని, ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేయ గా అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్‌లను ఏర్పాటు చేసి, వాటికి రంగులను కూడా వేయాలని సూచించారు. మెట్రో పిల్లర్ల పరిసరాలలో మట్టి కుప్పలను తొలగించి, రోడ్ల విస్తరణ చేపట్టి పచ్చదనాన్ని పెంచే లా చర్యలు తీసుకోవాలని మెట్రో అధికారులతో అన్నారు. బెల్వెదేర్ గార్డెన్స్ అపార్ట్‌మెంట్‌లో 200 వందల కుటుంబాలు ఉన్నాయని, తమకు నీటి సరఫరా సమస్య ఉన్నదని చెప్పగా వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గాంధీ దవాఖాన వెనక వైపు మురుగునీరు పారడం లాంటి సమస్యలను ప్రజలు ఈ ముఖాముఖిలో ప్రస్తావించారు. అధికారులతో పాటు టీఆర్‌ఎస్ ఇన్ చార్జి జి.పవన్‌కుమార్ గౌడ్, డివిజన్ నాయకులు ఏసూరి మహేశ్, కే.లక్ష్మీపతి, వెంకటేషన్ రాజు, శ్రీకాంత్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్, వెంకటరమణ, ముక్కశ్రీను, రాజేందర్, మహేందర్, కుశా ల్, ఈసీ రావు, జీకే రావు, పట్నాయక్, జగ్గయ్య, వెంకటేశం, జగదీష్ పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...