రూ. 1.70 లక్షల జరిమానా..


Sat,October 19, 2019 01:40 AM

ఎల్బీనగర్, నమస్తే తెలంగాణ : నిబంధనలు పాటించని హోటళ్లు, షోరూంలు, పెట్రోల్ బంక్‌లపై ఉప కమిషనర్లు హరి కృష్ణయ్య, విజయకృష్ణ, మారుతి దివాకర్‌ల ఆధ్వర్యంలో ఎల్బీనగర్ జోన్‌లోని హయత్‌నగర్, సరూర్‌నగర్ పరిధిలో జరిమానాలు విధించారు. పారిశుధ్య విభాగం ఎఎంఓహెచ్‌లు డాక్టర్లు మల్లికార్జున్‌రావు, మంజలవాణి ఉన్నారు.

అభినంద్ హోటల్‌కు రూ. లక్ష మన్సూరాబాద్ కామినేని చౌరస్తాలోని అభినంద్ గ్రాండ్ హోటల్‌కు జీహెచ్‌ఎంసీ సరూర్‌నగర్ సర్కిల్ అధికారులు రూ. లక్ష జరిమానా విధించారు. లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకోకుండా హోటల్‌ను నడపడంతో పాటుగా హోటల్‌లో పాలిథిన్ కవర్లను వాడటం, ఘన వ్యర్థాలను డ్రైనేజీలో వేస్తున్న ఆరోపణలతో శుక్రవారం తనిఖీ నిర్వహించారు. సరూర్‌నగర్ సర్కిల్ ఉప కమిషనర్ హరి కృష్ణయ్య, ఎఎంఓహెచ్ డాక్టర్ మల్లికార్జున్‌రావు, శానిటరీ సూపర్‌వైజర్ మహేందర్‌రెడ్డి ఉన్నారు.

నిస్సాన్ షోరూంకు రూ.50 వేలు
నాగోలు నిస్సాన్ షోరూంలో అధికారులు తనిఖీ చేశారు. సిల్ట్ చాంబర్ నిర్మించకపోవడం, ఇప్లూమెంట్ ప్లాంట్ లేకపోవడం, లిక్విడ్ వేస్టేజ్‌ను సక్రమంగా తొలగించకపోవడం, పారిశుధ్యం సక్రమంగా లేకపోవడంతో హయత్‌నగర్ సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ మంజుల వాణి నిర్వాహకులకు రూ. 50 వేల జరిమానా విధించారు.

పెట్రోల్ బంక్‌కు 20వేలు..
వనస్థలిపురంలోని ఓంసాయి సర్వీస్ సెంటర్ ఇండియన్ ఆయిల పెట్రోల్ బంక్‌లోను అధికారులు తనిఖీ చేశారు. టాయిలెట్లు మహిళలకు, పురుషులకు వేర్వేరుగా లేకపోవడం, బంక్‌లో మూత్రశాలలు ఉన్నట్లుగా ఎలాంటి సూచిక బోర్డు, లైటింగ్ ఏర్పాటు చేయకపోవడం పట్ల అధికారులు ఎల్బీనగర్ సర్కిల్ ఉప కమిషనర్ విజయకృష్ణ, ఎఎంఓహెచ్ డాక్టర్ మల్లికార్జున్‌రావు రూ. 20 వేల జరిమానా వేశారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...