ప్రకృతిని కాపాడుకుందాం


Sat,October 19, 2019 01:37 AM

ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడుకునేందుకు ముం దుకు రావాలి..మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వర్‌రావు, నటులు తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, జయలలిత, వినోద్‌బాల, కాదంబరి కిరణ్, రాంజగన్, టీఆర్‌ఎస్ నేత కర్నాటి విద్యాసాగర్ పిలుపునిచ్చారు. గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా శుక్రవారం జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన సినీ నటులు, నాయకులను రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ అభినందించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి రాఘవ, టీఆర్‌ఎస్ యువజన విభాగం నాయకుడు కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు. -సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...