6 కోట్లతో అభివృద్ధి


Sat,September 14, 2019 04:40 AM

-రూ.6కోట్లతో ప్రతిపాదనలు రెడీ
-నేడు కలెక్టర్ చెంతకు ఫైల్
-ఎంపీ సంతోశ్ చొరవతో కీసర రిజర్వుఫారెస్ట్ అభివృద్ధికి వేగంగా అడుగులు
-టెండర్లను పిలిచేందుకు అధికారుల కసరత్తు
-పూర్తయిన వెంటనే పనులు షురూ

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : కీసర రిజర్వు ఫారెస్ట్ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ సమాజం నాకు ఎంతో ఇచ్చింది, ఆ సమాజానికి నేను తిరిగి ఎంతోకొంత ఇవ్వాలి అనే ఎంపీ సంతోశ్ సంకల్పం కార్యరూపం దాల్చుతున్నది. తొలుత రూ.3కోట్లతో అభివృద్ధి చేయాలని భావించినప్పటికీ ప్రస్తుతం రూ.6కోట్లతో కీసర రిజర్వు ఫారెస్ట్‌ను ఆహ్లాదానికి కేరాఫ్‌గా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. శనివారం జిల్లా కలెక్టర్ పరిశీలనకు ఈ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ నినాదంలో భాగంగా ఎంపీ సంతోశ్‌కుమార్ మేడ్చల్ జిల్లాలోని కీసర రిజర్వు ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న విషయం విధితమే.

ఈ క్రమంలో ఆగస్టు 31వ తేదీన కీసర రిజర్వు ఫారెస్ట్‌ను సందర్శించి ఒకే రోజు విద్యార్థులు, మహిళలు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి సుమారు 15వేల మొక్కలను నాటిన ఎంపీ సంతోశ్ కీసర రిజర్వు పారెస్ట్‌ను అందమైన పార్కుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇన్నాళ్లు పడావుబడినట్లుగా ఉన్న రిజర్వు ఫారెస్ట్ త్వరలోనే సందర్శకులతో కటకిటలాడుతుందని అధికారులు ఆశాభావ వ్యక్తం చేస్తున్నారు. కీసర శ్రీ రామలింగేశ్వరస్వామి దర్శనంకు వచ్చే సందర్శకుల మనసును గెలిచేందుకు రకరకాల గార్డెన్స్‌తో పాటు కీసర రిజర్వు ఫారెస్ట్‌లో అక్కడక్కడ గజబోలు, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, యోగా కేంద్రాలు, ఓపెన్ జిమ్, అందమైన పార్కులు, చిల్డ్రన్స్ ప్లే పార్కులతో పాటు ప్రకృతి రమణీయత ఉట్టి పడేలా కీసర రిజర్వు ఫారెస్ట్‌ను ఎంపీ సంతోశ్ అభివృద్ధి చేయనున్నారు.

ముందస్తుగా ఈ పనులు
ఫారెస్ట్‌లో ముందస్తుగా గజబో, యోగాషెడ్డు నిర్మాణం, వాటర్ కాస్కేడ్ (పౌంటేన్), మినీ ట్యాంక్‌బండ్, థీమ్‌పార్కు నిర్మాణం, 15 ఫీట్ల ఎత్తైన మొక్కల పెంపకం, సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, రిజర్వు ఫారెస్ట్ చుట్టూ రూ.3కోట్లతో ఫెన్షింగ్ వంటి పనులను చేపట్టనున్నారు.

నగర ప్రజలకు వరం...
రోజురోజుకు నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో నగర శివారులోని పల్లెలు కూడా పట్టణాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నగర ప్రజలు సేదాతీరేందుకు, వారికి ఆరోగ్యకరమైన జీవనం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నగర శివారులోని రిజర్వు ఫారెస్ట్‌లను అర్బన్ లంగ్స్ పార్కులుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సంగతి విధితమే. ఇందులో భాగంగా మేడ్చల్ జిల్లా పరిధిలోని నారపల్లి, మేడిపల్లి, దూలపల్లి, చెంగిచెర్ల, నాగారం, కండ్లకోయ రిజర్వు ఫారెస్ట్‌లలో ఏర్పాటు చేసిన అర్బన్ లంగ్స్ పార్కులకు సందర్శకుల నుంచి మంచి ఆదరణ వస్తున్నది. ఈ క్రమంలోనే ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగా నిరాధరణకు గురైన కీసర రిజర్వు ఫారెస్ట్ ఎంపీ సంతోశ్ చొరువతో అభివృద్ధికి బీజాలు పడ్డాయని చెప్పవచ్చు. ఈ అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తవుతాయని, ఎకో టేరిజంకు అడ్రస్‌గా, అడ్వెంచర్ ఆటలకు నిలయంగా, ఆద్యాత్మికతకు కేరాఫ్‌గా మారుతుంది.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...