నీటిని వృథా చేస్తే కఠిన చర్యలు..


Sun,July 21, 2019 12:26 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మంచినీటిని వృథాచేస్తే కఠిన చర్యలు తప్పవని, అంతేకాకుండా పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తామని జలమండలి ఎండీ ఎం. దానకిశోర్ హెచ్చరించారు. శనివారం మింట్ కంపౌండ్‌లోని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఎండీ మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని పార్కులకు శుద్ధిచేసిన నీటిని వాడాలని, అందుకయ్యే ఏర్పాట్లు చేసేందుకు, అయ్యే ఖర్చుపై అంచనాలు తయారు చేసి సమర్పించాలని జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 20 ఎస్టీపీలు ఉన్నాయని, ఒక్కో ఎస్టీపీ పరిధిలోని 5 కిలోమీటర్ల లోపు ఉన్న అన్ని పార్కులకు సమీపంలో శుద్ధిచేసిన నీటిని వాడాలని నిర్ణయించామన్నారు. వర్షాకాలాన్ని పురస్కరించుకుని నీరు నిలిచే 195 ప్రాంతాలను గుర్తించామని, అధికంగా ఇబ్బందులు తలెత్తే 18 ప్రాంతాలను గుర్తించామన్నారు. వర్షాకాలం నేపథ్యంలో అన్నిశాఖల అత్యవసర స్పందన బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో హై దరాబాద్ జిల్లా సంయుక్త కలెక్టర్ గుగులోతు రవి, జలమండలి ట్రాన్స్‌మిషన్ డైరెక్టర్ డా. పీఎస్ సూర్యనారాయణ, ఆపరేషన్ డైరెక్టర్లు ఆజ్మీరా కృష్ణ, పి. రవి, టెక్నికల్ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్‌లతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...