ఆరు రిజర్వాయర్లను ప్రారంభించిన మంత్రి..


Sun,July 21, 2019 12:25 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జలమండలి ఆధ్వర్యంలో ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి గ్రామాలకు మంచినీటి సరఫరా కోసం నూతనంగా నిర్మించిన మరో 6 రిజర్వాయర్లను మంత్రి మల్లారెడ్డి శనివారం ప్రారంభించారు. శామీర్‌పేట మండలంలో నిర్మించిన ఈ ఆరు రిజర్వాయర్లను స్థానిక ప్రజాప్రతినిధులు, జలమండలి అధికారులతో కలిసి ప్రారంభించారు. శామీర్‌పేట మండలంలో మొత్తం 14 రిజర్వాయర్లకు గాను తూముకుంట మున్సిపాలిటీలో నిర్మించిన ఈ ఆరు రిజర్వాయర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం రూ. 748 కోట్లలో చేపట్టిన ఈ పథకంలో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లను దశల వారిగా ప్రారంభిస్తుండగా, శుక్రవారం కీసర మండలంలో 6 రిజర్వాయర్లు ప్రారంభంకాగా, తాజాగా శనివారం తూముకుంటలో 6 రిజర్వాయర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. జలమండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ -2 శ్రీధర్‌బాబు సహా ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...