మేడ్చల్‌కు 222 మీ సేవా కేంద్రాలు మంజూరు


Sun,July 21, 2019 12:25 AM

మేడ్చల్ కలెక్టరేట్ : ప్రజలు డిజిటల్ విధానాన్ని అలవర్చుకునేలా అధికారులు కృషి చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి అన్నారు. జిల్లాలో ఈ గవర్నెన్స్‌ను ప్రోత్సహించడానికి కమిటీ సభ్యులతో కలెక్టర్ తన చాంబర్‌లో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాచార టెక్నాలజీని ఉపయోగించేలా, ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రజల మధ్య ఎలక్ట్రానిక్ డివైస్ ఒక వారధిగా ఉపయోగించాలని, వివిధ శాఖల మధ్య వివిధ శాఖల స్టెక్ హోల్డర్స్ మధ్య సమన్వయం కోసం ఈ గవర్నెన్స్ తోడ్పటును అందిస్తున్నదని పేర్కొన్నారు. గ్రామ, మండల , జిల్లా స్థాయి వరకు ప్రజలకు ఈ గవర్నెన్స్ మీద అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 279 మీ సేవ కేంద్రాలు ఉన్నాయని జనాభా ప్రతిపాదికన 5 వేల మందికి ఒక మీ సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి 222 మీ సేవా కేంద్రాలను మంజూరు చేస్తు న్నామని తెలిపారు. ప్రజలు మీ సేవ కేంద్రాల ద్వారా క్యాస్ట్, ఇన్‌కమ్, పహానీతో పాటు ఇతర ధ్రువీకరణ పత్రాలు పొందే విధంగా మీ సేవ కేంద్రాలు పనిచేసేలా తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్తగా మీ సేవ కేంద్రాలకు దరఖాస్తు చేసుకొనే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండాలని, పరీక్ష విధానం ద్వారా ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. డీఆర్‌ఓ మధుకర్‌రెడ్డి,జడ్పీ సీఈఓ దేవసహయం, డీపీఓ రవికుమార్, డీఎంహెచ్‌ఓ నారాయణ పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...