సొంతింటి కల సాకారం..


Thu,July 18, 2019 03:29 AM

కీసర: పేదల సొంతింటి కల సాకారమైంది. కీసర మండలంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. మొదటి విడుతలో 817.7 కోట్ల రూపాయలతో 130 గృహాలను నిర్మించారు. కీసర, యాద్గార్‌పల్లి, చీర్యాల్ గ్రామాల్లో మొత్తం 130 ఇండ్లకు 2016 సెప్టెంబర్ 28న పనులు మొదలయ్యాయ. కీసరలో 50, యాద్గార్‌పల్లిలో 40, చీర్యాల్‌లో 40 ఇండ్లను మంజూరు చేశారు. జిల్లా కలెక్టర్ ఎం.వీ.రెడ్డి పర్యవేక్షణలో ఇండ్ల నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఒక్కో ఇంటికి రూ.5.40 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులను కేటాయించింది. ఈ ఇండ్లు విశాలంగా నిర్మించడంతో లబ్ధిదారుల నుంచి ఆపూర్వ స్పందన లభిస్తున్నది.

జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ...
మండలంలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంలో జిల్లా కలెక్టర్ ఎం.వీ.రెడ్డి ప్రత్యేక చొరవ చూపించారు. ఇండ్ల నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటికి నాలుగైదుసార్లు సందర్శించి త్వరితగతిన పూర్తి చేయాలని సదరు కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ ఇండ్ల విషయంలో నెలకొన్న పలు సమస్యలను కలెక్టర్ దగ్గరుండి పరిష్కరించారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించి సదరు కాంట్రాక్టర్లు, ఆర్‌అండ్‌బీ అధికారులతో అనేక సార్లు సమీక్ష సమావేశాలను నిర్వహించి ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలని సమీక్ష సమావేశాలను నిర్వహించి పూర్తి చేశారు. చీర్యాల్, యాద్గార్‌పల్లి, కీసర గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్‌రూం పనులను పూర్తి చేశాం. ప్రభుత్వ ఆదేశాలు రాగానే గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తాం. ఈ గ్రామాల్లో ఉన్న లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకొన్నారు. లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం మండల రెవెన్యూ అధికారుల ఆధీనంలో ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఈ ఇండ్లు ఎంపికైన లబ్ధిదారులకు కేటాయిస్తాం. ఇండ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. అని ఆర్‌అండ్ బీ ఈఈ చందర్‌సింగ్ అన్నారు.

అసలైన లబ్ధిదారులకు కేటాయించాలి
ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను గ్రామాల్లో ఉన్న అసలైన లబ్ధిదారులకు కేటాయించాలి. డబుల్ బెడ్‌రూం ఇండ్లలో పైరవీలు జరుగకుండా ఇండ్లులేని వారికి మాత్రమే కేటాయించాలి. లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం గ్రామసభలోనే జరుగాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ డబుల్ బెడ్ రూం పథకం ప్రజలకు గొప్ప వరంలాంటిది. ఇలాంటి పథకాన్ని గతంలో ఏ ప్రభుత్వం చేపట్టలేదు. ప్రభుత్వానికి ప్రజలంతా రుణపడి ఉంటారు.
- బండారు శంకర్‌గౌడ్ కీసర పంచాయతీ సభ్యులు

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారు
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పథకాలను నిరుపేదలకు అందించడంలో నంబర్‌వన్‌గా నిలిచారు. ప్రజల కష్టాలను పట్టించుకోవడంలో మన ముఖ్యమంత్రికి ఎవరు సాటిరాలేరు. డబుల్ బెడ్‌రూం పథకం ప్రజలు చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారు. ప్రభుత్వమే లక్షలాది రూపాయలు వెచ్చించి ఇండ్లులేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించి అన్ని హంగులతో నేరుగా ఇండ్లకు పంపుతున్న ముఖ్యమంత్రిని మనం ఏనాడు చూడలేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటారు.
-రామారం ప్రదీప్‌కుమార్ పంచాయతీ సభ్యులు కీసర

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...