తిష్ట వేసినవాళ్లను వెతికి పట్టుకున్నారు


Wed,July 17, 2019 03:24 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నిబంధనలకు విరుద్దంగా హైదరాబాద్‌లో తిష్టవేసిన విదేశీయులను గుర్తించి, వారి స్వదేశాలకు పంపించేందుకు సిటీ పోలీసులు మంగళవారం ఆకస్మికంగా నగరంలోని వివిధ ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్, స్పెషల్‌బ్రాంచ్, స్థానిక పోలీసులు, ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ(ఫారెన్ రిజిస్ట్రేషన్ రిజియనల్ అఫీస్) సిబ్బంది సంయుక్తంగా ఈ సోదాలు నిర్వహించారు. నైజీరియన్, సుడాన్, సోమాలియా తదితర అఫ్రికన్ దేశస్థులు ఎక్కువగా నివాసముండే టోలిచౌక్, గోల్కొండ, బంజారాహిల్స్, అసీఫ్‌నగర్, హుమాయిన్‌నగర్, నాంపల్లి, ఉస్మానియా యూనివర్శీటీ, చాంద్రాయణగుట్ట, బోయిన్‌పల్లి తదితర పోలీస్‌స్టేసన్ల పరిధిలో నివాసముంటున్న విదేశీయులను తనిఖీ చేశారు. ఆయా ప్రాం తాలలో నివాసమున్న వారందరిని స్థానికంగా ఉండే ఒక ఫంక్ష న్ హాల్‌కు తరలించి, వారి పాస్‌పోర్టు, వీసా పత్రాలను పరిశీలించారు. ఈ వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వివరించారు. మొత్తం 73 మందిని విచారించామని, అందులో 23 మంది నిబంధనలకు విరుద్దంగా దేశంలో తిష్టవేసినట్లు గుర్తించామన్నారు. వీరిని వారి స్వదేశాలకు డిపోర్టు చేయనున్నట్లు తెలిపారు. 21 బృందాలుగా విడిపోయి, ఈ సోదాలు నిర్వహించినట్లు సీపీ తెలిపారు. పాస్‌పోర్టు యాక్టులోని నిబంధనల మేరకు వారికి పాస్‌పోర్టు రెన్యూవల్, ఎగ్జిట్ వీసాకు సంబంధించి వివరించామన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్దంగా ఉన్నారని సమాచారం వస్తే డయల్ 100కు, స్థానిక పోలీసులకు సామాన్య ప్రజలు సమాచారం ఇవ్వవచ్చన్నారు. ఎస్బీ జాయింట్ సీపీ తరుణ్‌జోషి, టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధకిషన్‌రావు, ఇన్స్‌పెక్టర్ గట్టుమల్లు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...