గ్రంథాలయాలకు కొత్త సొబగులు


Tue,July 16, 2019 04:03 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: విజ్ఞాన సౌరభాలు వెదజల్లే గ్రంథాలయాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. రూపురేఖలు మార్చుకుని ఆధునీకరంగా తయారై పాఠకులను స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలో గ్రంథాలయాలకు ఆధునీకరణ, మరమ్మతుల కోసం పెద్దఎత్తున నిధులను మంజూరు చేశారు. 7 గ్రం థాలయాలకు నూతన భవనాలు, మరో 28 గ్రంథాలయాలను సుందరీకరించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకోసం రూ.3.29 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీంట్లో రూ.2 కోట్ల మొత్తాన్ని చిక్కడపల్లిలోని నగరకేంద్ర గ్రంథాలయానికే కేటాయించగా, మరోరూ.1.29 కోట్లను 28 గ్రంథాలయాల మరమ్మతులకు మంజూరు చేశారు. టెండర్లు పూర్తి చేసిన అధికారులు నిర్వహణ సంస్థలతో పలు పనులను చేయిస్తున్నారు. ఇప్పటివరకు 9 గ్రంథలయా ల రూపురేఖలను మార్చేశారు. ఆయా గ్రంథాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసి పనులు పూర్తి చేశారు. మరో 17 గ్రంథాలయాల రూపురేఖలు మా ర్చేందుకు నిధులు మంజూరు కాగా, అవి టెండర్లు అగ్రిమెంట్ దశలో ఉన్నాయి.

సర్వ జనులకు సేవలు
గ్రంథాలయాలు నేటికీ సర్వజనులకు సేవలందిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగార్ధుల అడ్డాలుగా తయారయ్యాయి. విద్యార్థు లు.. నిరుద్యోగులు.. పోటీపరీక్షల కోసం సిద్ధమవుతున్న ఆశవాహులు గ్రంథాలయాలనే ఎంచుకుని, వాటిల్లోనే సన్నద్ధమవుతున్నారు. పాఠకుల అభిరుచులకు తగినట్లుగా గ్రంథాలయాలు సైతం మార్పున కు గురవుతున్నాయి. గ్రంథాలు, పుస్తకాలు. దినపత్రికలను అందుబాటులో ఉంచుతూ పాఠకుల మన్ననలను పొందుతున్నాయి. వృద్ధులు.. పిల్లలు.. యువ త అన్నతేడా లేకుండా అందరూ గ్రంథాలయాలను వినియోగించుకుంటున్నారు. విలువైన పుస్తకాలు. సా హిత్యం..లక్షలాది గ్రంథాలను భద్రపరిచి పాఠకుల అభిరుచులను తీరుస్తున్నాయి.

పూర్తయిన పనులు -వెచ్చించిన మొత్తం
-నగర కేంద్ర గ్రంథాలయం అశోక్‌నగర్‌లో స్త్రీ సాంకేతిక విభాగం ఏర్పాటు, పురుషులకు వేర్వేరుగా టాయ్‌లెట్లు, గదులు, వరండా నిర్మాణానికి రూ.1.6 కోట్లను మంజూరు చేయగా, ఇప్పటివరకు రూ.54.79 లక్షల ను ఖర్చుచేసి పలు నిర్మాణా పూర్తి చేశారు. ఇక పాత భవనం మరమ్మతులు, నిర్వహణ నిమిత్తం రూ.30 లక్షలు కేటాయించగా రూ. 24,57 లక్షలను ఖర్చుచేసి పలు పనులు పూర్తి చేశారు. ఫర్నిచర్ కొనుగోలు కోసం మరో రూ.50 లక్షలను మంజూరుచేయగా జైళ్లశాఖ నుంచి తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
-మలక్‌పేట శాఖా గ్రంథాలయానికి రూ.3 లక్షలతో మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదించగా, రూ.2.48 లక్షలను ఖర్చుచేసి, పనులు పూర్తి చేశారు.
-సంతోష్‌నగర్ గ్రంథాలయానికి ప్రహరీ నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ కోసం రూ.15 లక్షలు మం జూరుచేయగా, రూ.14.44లక్షలు వెచ్చించి పలు పనులు పూర్తి చేశారు.
-కవాడిగూడ గ్రంథాలయంలో పలు పనుల కోసం రూ.8 లక్షలను మంజూరుచేయగా, వాటిలో నుంచి రూ.5.61 లక్షలను ఖర్చుచేసి పనులు పూర్తి చేశారు.
-ఎస్సార్‌నగర్ శాఖా గ్రంథాలయ భవనం మరమ్మతులు, ఇతర సివిల్స్ వర్క్స్ నిమిత్తం రూ.6 లక్షలను మంజూరుచేయగా, దాంట్లో నుంచి రూ.4.68లక్షలతో పలు పనులు చేపట్టగా, అవి తుది దశలో ఉన్నాయి.
-బజార్‌ఘాట్ గ్రంథాలయానికి మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర వసతులు, సౌకర్యాల కల్పన కోసం రూ.4.30 లక్షలను కేటాయించగా, రూ. 3.74 లక్షలను ఖర్చుచేసి సౌకర్యాలు కల్పించారు.
-రహీంపుర గ్రంథాలయ మరమ్మతుల కోసం రూ. 6.50 లక్షలను మంజూరుచేయగా, ఇప్పటివరకు రూ. 1.56లక్షలు ఖర్చుచేసి పలు పనులను పూర్తిచేశారు.
-రహ్మత్‌నగర్ శాఖ గ్రంథాలయానికి రూ.3.50 లక్షలతో మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదించగా, దాం ట్లో నుంచి, రూ.2.99 లక్షల విలువైన పనులను పూర్తి చేశారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...