సెంటర్ ఫర్ మైక్రోబియల్ ఫర్మంటేషన్ ప్రారంభం


Tue,July 16, 2019 04:02 AM

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీలో సెంటర్ ఫర్ మైక్రో బియల్ అండ్ ఫర్మంటేషన్ టెక్నాలజీను ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం, రిజి స్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. కేంద్ర మానవ వన రుల అభివృద్ధి శాఖకు సంబంధించిన సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌గా దీనిని ఏర్పాటు చేశారు. కేంద్రప్రభుత్వ పథకమైన రాష్ట్రీయ్ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా)2.0 పథకం కింద ఓయూకు రూ.వంద కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధుల నుంచి ఓయూలో మొత్తం ఏడు పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో రూ.3.68 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఇది కూడా ఒకటి కావడం విశేషం. కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం వీసీ, రిజిస్ట్రార్‌లతో కలిసి సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ భీమా వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సాంకేతికతను మెరుగు పరిచి, పరిశ్రమలకు అందజేసేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. పెట్రోలియం వనరులు తరిగిపోతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ వనరులపై ఆధార పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ వ్యర్థాలను ఉపయో గించి బయో ఇథనాల్ ఇంధనాన్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు లిగ్నోసెల్ లోజిక్ ద్వారా బయో ఇథనాల్‌ను ఉత్పత్తి చేసి పెట్రోల్‌లో కలుపుతున్నప్పటికీ, లిగ్నిన్‌ను వృథాగా వదిలేస్తున్నారని పేర్కొ న్నారు. దానిని కూడా వినియోగించుకుంటూ ఉత్పత్తి వ్య యాన్ని తగ్గించేందుకు తమ కేంద్రంలో పరిశోధనలు చేయనున్నట్లు వివరించారు. ఇప్పటికి తమ కేంద్రంలో కల్లు, చికెన్ వేస్టేజ్, ఆవు పాలు వంటి పదార్థాల నుంచి రూపొందించిన 56 ప్రో బయాటిక్స్ పదార్థాలు ఉన్నాయని, వీటన్నింటినీ మిళితం చేసి, పొడి రూపంలో పరిశ్రమలకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. క్యాన్సర్ వ్యాధి చికిత్సలో ఫ్యుజన్ ప్రొటీన్స్‌ను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ కృష్ణారావు, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జితేందర్‌నాయక్, రూసా నోడల్ ఆఫీసర్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసులు, పీఆర్‌వో డాక్టర్ సుజాత, కేంద్రం డైరెక్టర్లు డాక్టర్ స్మితా పవార్, డాక్టర్ ఉలగనాథన్, డాక్టర్ కవితావాఘ్రే తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...