లోపాన్ని ముందే గుర్తించడం మంచిదయింది


Tue,July 16, 2019 04:01 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలలకు సంబంధించి సుమారు 100 మంది బాలబాలికలు శ్రీహరికోటకు వచ్చారు. శ్రీహరికోటను సందర్శించడమే గొప్ప అనుభూతి అని ఈ సందర్భంగా వారు అన్నారు. చంద్రయాన్ 2 ప్రయోగానికి వస్తున్నామని ఎంతో గర్వంగా ఫీలయ్యామని, శ్రీహరికోటలో అడుగు పెట్టకుండానే ఇంకా ఆసక్తి పెరిగిందన్నారు. ఈ సందర్భంగా మైనారిటీ వెల్ఫేర్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి నిమిషాల్లో అనూహ్యంగా ఆగిపోవడం పట్ల దేశాభిమానులు, శాస్త్ర సాంకేతిక రంగ నిపుణులు కాస్తా నిరాశ చెందారు. వాహననౌక జీఎస్‌ఎల్వీ మార్క్ 3లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించడంతో చాలా మంది బాధపడ్డారు. గొప్ప ప్రయోగం కవరేజి ఇస్తామని వచ్చిన దేశ, విదేశీ ప్రతినిధులు కూడా జీర్ణించుకోలేకపోయారు. తే ఇస్రో ప్రయోగించనున్న చంద్రయాన్ 2ను తిలకించడానికి 10వేల మందికి అవకాశం కల్పించారు. కానీ చూద్దామని వచ్చిన వారికి నిరాశ ఎదురైంది.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...