ప్లాస్టిక్‌ వాడకంపై స్వీయనిషేధం..ఫ్రీ జూలై చాలెంజ్‌.


Mon,July 15, 2019 12:38 AM

హఫీజ్‌పేట్‌: ప్లాస్టిక్‌ వాడకంపై స్వీయ నిషేధానికి ప్లాస్టిక్‌ ఫ్రీ జూలై చాలెంజ్‌ తీసుకోవాలని తద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలని కోరుతున్నారు మన హైదరాబాద్‌ నగరానికి చెందిన భార్గవి బిజ్జం .ఆస్ట్రేలియాకు చెందిన ప్లాస్టిక్‌ ఫ్రీ ఫౌండేషన్‌ 2017లో మొదలుపెట్టిన ఈ చాలెంజ్‌లో ప్రపంచవ్యాప్తంగా 12.7 కోట్ల మంది ప్రజలు పాల్గొననున్నా రు. ఒకేసారి వాడి పారవేసే ప్లాస్టి క్‌ గ్లాసులు, ప్లేట్‌లు, కవర్లు మొదలయిన వాటిని సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్స్‌ అంటారు.ఈ చాలెంజ్‌లో పాల్గొనేవారు జూలై మాసం మొత్తం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకుండా ఉండాలి.డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ప్లాస్టిక్‌ ఫ్రీజూలై.ఆర్గ్‌ వెబ్‌సైట్‌లో ఈ చాలెంజ్‌కోసం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకుండా ఉండేందుకు టిప్స్‌ ఉంటాయి. ఉదాహరణకు కిరాణాషాప్‌ లేదా సూపర్‌మార్కెట్‌కి వెళ్లినప్పుడు జూట్‌బ్యాగు తీసుకెళ్లడం ఆఫీసుల్లో ఉద్యోగ నిర్వహణలో ఉన్నప్పుడు టీ కానీ కాఫీ సేవించేటప్పుడు ప్లాస్టిక్‌, డిస్పో జబుల్‌ కాఫీ కప్‌కు బదులు కాఫీ మగ్గు పెట్టుకోవడం లాంటి టిప్స్‌ ఎన్నో ఉంటాయి. మన హైదరాబాద్‌కు చెందిన భార్గవి బిజ్జం తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌ (భార్గవి_బిజ్జం)లో ప్లాస్టిక్‌ ఫ్రీ జీవనశైలికి సంబంధించిన చాలా చిట్కాలు షేర్‌ చేస్తున్నారు. కంపోస్టింగ్‌, ఆర్గానిక్‌ పద్ధతిలో ఇంట్లో కూరగాయలు పెంచడం, తడి, పొడి చెత్తను వేరుచేయడం వంటి విషయాల మీద కార్పొరేట్‌ వర్క్‌షాప్స్‌ చేసే భార్గవి బిజ్జం పర్యావరణ పరిరక్షణలో ప్లాస్టిక్‌వాడకంపై స్వీయనిషేధానికి సంబంధించిన చాలా పోస్ట్‌లు తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా భార్గవి బిజ్జం మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్‌ ఫ్రీ చాలెంజ్‌ ద్వారా సగటున సంవత్సరానికి ఒక్కో ఇంట్లో 28 కిలోల డిస్పోజబుల్‌ ప్లాస్టిక్‌ వాడకం తగ్గిందని ప్లాస్టిక్‌ ఫ్రీ ఫౌండేషన్‌ సర్వేల్లో తేలిందన్నారు.అంటే సంవత్సరానికి 49 కోట్ల కిలోల ప్లాస్టిక్‌ వాడకం తగ్గిందంటున్నారు. పర్యావరణ హితం కోరి చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతిఏటా జూలై మాసంలో నిర్వహించే ఈ చాలెంజ్‌లో మన నగరం నుంచి ఎక్కువ మంది భాగస్వాములవ్వాలని ఆమె పిలుపునిచ్చారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...