విమానాశ్రయానికి కొత్త మార్గం


Mon,July 15, 2019 12:37 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుంది. నగరంలో పెరుగుతున్న రద్ధీకి అనుగుణంగా రవాణా సౌకర్యాలు మెరుగుపర్చే మార్గాలను హెచ్‌ఎండీఏ అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇందులో భాగంగానే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు వీలుగా నాలుగు లేన్ల రహదారి ఏర్పాటుకు మార్గం సుగమమం చేశారు. శ్రీశైలం హైవే నుంచి మామిడిపల్లి మార్గంలో ఫ్లై ఓవర్‌ నిర్మాణంతో ఎయిర్‌పోర్టు రోడ్‌కు కనెక్టివిటీ చేయనున్నారు. ఈ మేరకు హెచ్‌ఎండీఏ పీ 7 రోడ్‌ (ఫ్లై ఓవర్‌) ప్రాజెక్టుపై స్ట్రూప్‌ కన్సల్టెన్సీతో అధ్యయనం జరిపించారు. 700 మీటర్ల పరిధిలో ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి రూ. 68కోట్లు ఖర్చు కానుందని పేర్కొంటూ సదరు స్ట్రూప్‌ కన్సల్టెన్సీ హెచ్‌ఎండీఏ డిటెల్ట్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను ఇటీవల సమర్పించింది. 1.3 ఎకరం మేర ప్రైవేట్‌ స్థలాన్ని సేకరించాల్సి ఉంది. ప్రస్తుతం భూ సేకరణ తుది దశలో ఉంది. ప్రభుత్వ అనుమతి తీసుకుని ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులకు టెండర్లను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అదికారులు పేర్కొంటున్నారు. ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంత ప్రజల సంక్షేమ దృష్ట్యా ఇక్కడ ఫ్లై ఓవర్‌ నిర్మాణం అనివార్యమంటూ నిర్ణయించి అమలు దిశగా అడుగులు వేశారు.

ఫ్లై ఓవర్‌తో బహు ప్రయోజనాలు
పీ7రోడ్‌లో భాగంగా నిర్మాణం, ఫ్లై ఓవరు నిర్మాణాల పూర్తితో బహు ప్రయోజనాలు కలగనున్నాయి. హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేయనున్న పి 7 రహదారితో ప్రత్యేకంగా మైలార్‌దేవ్‌పల్లి, దుర్గానగర్‌,లక్ష్మీగూడ, మాదన్నగూడ, జాలపల్లి, మామిడిపల్లి గ్రామాలకు రహదారి వసతి మెరుగవుతుంది. సైదాబాద్‌, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బి నగర్‌ల మీదుగా వచ్చే వారు చాలా మంది విమాన ప్రయాణీకులు ఈ రోడ్డులోనే వెళ్లే వీలుంటుంది. ముఖ్యంగా మైలార్‌ దేవ్‌పల్లి నుండి మామిడిపల్లి మీదుగా విమానాశ్రయం చేరుకునేందుకు హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేయనున్న ఫ్లై ఓవర్‌తో (పి 7)తో ప్రయాణికులకు 5 కి.మీల దూరం తగ్గుతుంది. ప్రస్తుతం మామిడిపల్లి నుండి పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే వెంట విమానాశ్రయానికి వెళ్ళాలంటే 15 కి.మీలు ప్రయాణించాల్సి ఉన్నది. ప్రస్తుతం మామిడిపల్లి నుండి విమానాశ్రయానికి చేరుకునే వారు పహాడిషరీఫ్‌ , కుర్మగూడం ద్వారా వెళ్తున్నారు. ఐతే ఈ రోడ్డు కూడా అంతగా సౌకర్యంగా లేదు. ఈ క్రమంలోనే అసంపూర్తిగా ఉన్న రోడ్డును అభివృద్ధి చేయడం ద్వారా విమాన ప్రయాణికులకు 10కి.మీల లోపు దూరం ఉంటుంది.

దీనిని ఈ రహదారి దుర్గానగర్‌లో 220 మీ.లు, లక్ష్మీగూడ వద్ద 100 మీ.లు పనులను వేగిరం చేశారు. దీంతో పాటు ఫ్లై ఓవర్‌ నిర్మాణం పనులతో టీఎస్‌ఐఐసీ (తెలంగాణ స్టేట్‌ ఇండ్రస్టీయల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌)తో పాటు శ్రీశైలం హైవే నుంచి బెంగుళూరు హైవే, ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణీకులకు దూరాభారం తగ్గుతుంది. ఈ మార్గాల్లో ఇండ్రస్టీయల్‌ వర్గాలకు భారీ వాహనాలు వచ్చేందుకు దోహదపడుతుంది.పహాడిషరీఫ్‌, జల్‌పల్లి పెద్ద చెరువులు అలుగు పోస్తుండడం, ఈ ఫ్లై ఓవరు పూర్తి అయితే 2, 3 చోట్ల రహదారి ప్రయాణానికి సమస్య దూరం అవుతుంది.. జల్‌పల్లి, పహాడిషరీఫ్‌, కందుకూరు, మహేశ్వరం ప్రాంతాల ప్రజలలు రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, మైలార్‌దేవరపల్లికి వచ్చేందుకు మార్గం సుగమమం అవుతుంది. పహాడిషరీఫ్‌ గ్రామం మధ్యలో నుంచి ఇరుకైన రహదారి ఉంది. ఈ సమస్యకు కూడా తీరనుంది. మామిడిపల్లి, దుర్గానగర్‌, లక్ష్మీగూడలో ప్రత్యేకంగా వ్యాపార కేంద్రాల ఏర్పాటు, రియల్‌ వ్యాపారం ఊపందుకుని టౌన్‌షిప్‌లు రానున్నాయని హెచ్‌ఎండీఏ అధికార వర్గాలు తెలిపారు.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...