ఐక్యంగా ఉంటే సమస్యలు పరిష్కారం


Mon,July 15, 2019 12:35 AM

తుక్కుగూడ : కష్టజీవులంతా ఐక్యంగా ఉంటూ తమ హక్కులు సాధించుకోవచ్చని సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బంగారి నర్సింహ అన్నారు. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని దేవేందర్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడిపాలనలో దినసరి కార్మికుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు, కర్షకులకు ప్రత్యేక నిధితో ఆదుకుంటున్నదని తెలిపారు. దినసరి కూలీ దొరకనిదే వారి కుటుంబం గడవని పరిస్థితులుంటాయని, అలాంటి వారిని సంఘంలో సభ్యులుగా చేరేలా చూడాలన్నారు. నూతనంగా చేరిన 96 మంది కార్మికులకు లేబర్‌ కార్డులు అందజేశారు. హైదరాబాద్‌ సగర సంఘం అధ్యక్షుడు రాములు, రాష్ట్ర సాగర సంఘం కార్యదర్శి శేఖర్‌, సత్యనారాయణ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగితే రూ. 50 వేల నుంచి రూ. 6 లక్షల వరకు ప్రభుత్వం చెల్లిస్తున్నదని తెలిపారు. కాలనీ సగర సంఘం అధ్యక్షుడు రాంచంద్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నరహరి, వివేకానంద, జంబులు, శ్రీను, నాయకులు చంద్రశేఖర్‌, నరేశ్‌, శ్రీశైలం పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...