గాంధీ ఆశయాలు, సిద్ధాంతాలను విస్తృత ప్రచారం చేయడమే లక్ష్యం


Mon,July 15, 2019 12:34 AM

-సెప్టెంబర్‌లో ఎల్బీ స్టేడియంలో గాంధీ 150వ జయంత్యుత్సవాలు
-12వేల మంది విద్యార్థులతో గాంధీజీవేషధారణ , యోగా ప్రదర్శన
-గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ సంస్థల చైర్మన్‌డాక్టర్‌ గున్నా రాజేందర్‌ రెడ్డి
బషీర్‌బాగ్‌ : మహాత్మా గాంధీ ఆశయాలు, సిద్ధ్దాంతాలను ప్రజలు, విద్యార్థులకు తెలియజేసేందుకు గాంధీజీ 150 జయంతి ఉత్సవాలను రెండు రాష్ర్టాల వ్యాప్తంగా నిర్వహించనున్నట్టు గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్ఠాన్‌ సంస్థ తెలంగాణ, ఏపీ రాష్ర్టాల చైర్మన్‌ డాక్టర్‌ గున్నా రాజేందర్‌ రెడ్డి, కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, యానాల ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. వచ్చే సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో సర్కిల్‌ స్థాయి నుంచి విస్తృత సామాజిక, నిర్మాణాత్మక కార్యక్రమాలు, మహనీయుడు ప్రబోధించిన అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు విభిన్న కార్యక్రమాలను చేపట్టనుమన్నామని పేర్కొ న్నారు. ఈ మేరకు ఆదివారం బషీర్‌బాగ్‌లో ఐక్యరాజ్యసమితి సూచించిన ‘గాంధీజీ సిద్ధ్దాంతాలు, 17 సుస్థిర లక్ష్యాలు-2030’కి సంబంధించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సెప్టెంబర్‌ మాసంలో నిర్వహించనున్న గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలకు దేశ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో పాటు ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. 12,150 మంది విద్యార్థులతో గాంధీ వేషధారణ, 10,150 మంది విద్యార్థులతో యోగా ప్రదర్శనతో పాటు, గాంధీజీ సిద్ధ్దాంతాలు, ఆశయాలను ప్రజల కండ్లకు కట్టేటట్లు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అన్ని విధాల సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో తమ సంస్థల ప్రతినిధులు భాగస్వాములు అవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థల ప్రతినిధులు ఎం. రామాంజనేయులు, ఎండీ. ఇస్మాయిల్‌, అంజయ్య, ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎన్‌. రెడ్డి, కోశాధికారి పి. వెంకట్‌రెడ్డి, అనీఖ్‌, కే. నాగమణి తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...