ఒడిస్సీ ఉత్సవం అద్భుతం


Mon,July 15, 2019 12:34 AM

-సూరత్‌, చెన్నై, పుణెల నుంచి వచ్చిన నృత్యకారులు
-చిన్నారులు, యువత, నాట్యగురువులుసహా 67 మంది ప్రదర్శన
-గజ్జెల సవ్వడితో హోరెత్తిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఒడిషా రాష్ర్టానికి చెందిన సంప్రదాయ నృత్యం ‘ఒడిస్సీ’. జగన్నాథ స్వామికి ఈ నృత్య రూపం ఎంతో ఇష్టమంట. అందుకే, ఆభరణాలను మొత్తంగా ఈ సంప్రదాయ నృత్యంలో వెండివి మాత్రమే అధికంగా వాడుతారట. ప్రతి సంవత్సరం జూలైలో ఒడిస్సీ ఉత్సవాన్ని ప్రప్రంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ నగరం ఒక మినీ భారతం.. అయితే, ఇక్కడ వివిధ రాష్ర్టాల వారి మాదిరిగానే ఒడిషా వాసు లు కూడా నివసిస్తున్నారు. ఈనేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలోనూ ప్రప్రథమంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో ఒడిస్సీ అంతర్జాతీయ ఉత్సవ్‌-2019ని ఆదివారం నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ర్టా ల ఉన్న ఒడిస్సీ నృత్య కళాకారులు, గురువులు, శిక్షకులు, విద్యార్థులు, కళాభిమానులు ఆదివారం ఒకే వేదిక మీదకొచ్చి, వారి కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు. సూరత్‌, చెన్నై, పుణెల నుంచి కళాకారులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. నృత్యకారులు, గజ్జెల సవ్వడితో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఆదివారం హోరెత్తిపోయింది. తెలుగు వారు, ముస్లింలు సైతం ఒడిస్సీ నృత్య ప్రదర్శనలో పాల్గొని వారి వారి సత్తా చాటారు. సోలో, బృంద, యుగళ నృత్యాలను ఉత్సవంలో ప్రదర్శించారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఏకధాటిగా నృత్యాలు ప్రదర్శించి కళాభిమానుల మన్ననలు పొందారు. వీక్షకులచే కరతాళ ధ్వనులు చేయించారు. తుదకు హైదరాబాద్‌ ఒడిస్సీ నృత్యోత్సవం అద్భుతమనిపించారు. ప్రదర్శనలో మొత్తంగా 67 మంది కళాకారులు పాల్గొన్నారు. నృత్యోత్సవంలో వందలాదిగా కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...