నిజాం కుటుంబం రక్తదానం


Sun,July 14, 2019 12:07 AM

బేగంబజార్ : నిజాం మనవడు, మునిమనవలు, మనవరాలు ఉస్మానియా దవాఖానలో హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో వారు పాల్గొని రక్తదానం చేశారు. దవాఖానలోని బ్లడ్ బ్యాంక్‌లో జరిగిన రక్తదాన శిబిరంలో నిజాం మనవడు నవాబ్ నజఫ్ అలీఖాన్ ఆయన ముగ్గురు పిల్లలు రక్తదానం చేయగా, వారితోపాటు ఉస్మానియా దవాఖానకు చెందిన ముగ్గురు ఆర్‌ఎంవోలు కూడా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నిజాం మనవడు నవాబ్ నజఫ్ అలీఖాన్ మాట్లాడుతూ ఉస్మానియా జనరల్ దవాఖానలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారని తన పిల్లలకు చెప్పినప్పుడు వారు రక్తదానం చేయడానికి ఎంతో ఆసక్తి చూపారన్నారు. ఫౌండేషన్ వలంటీర్లు, స్వచ్ఛంద సంస్థవారు రక్తదానంపై అవగాహన కల్పించడంతో దవాఖానలో రోగులకు సహాయకులుగా వచ్చిన వారు, సందర్శకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారని తెలిపారు. ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ రక్తదానం ప్రాముఖ్యతను వివరించారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన వారికి, రక్తదాన శిబిరం నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ముజ్తబా హసన్ అక్సారీకి కృతజ్ఞతలు తెలిపారు. ఒక్క రోజులోనే 80 యూనిట్ల రక్తాన్ని శిబిరం ద్వారా సేకరించారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...