చదువుల చెట్టు కింద..పాతికేండ్ల్లనాడు


Sun,July 14, 2019 12:06 AM

-ఒకే వేదికపైకి 1988వ బ్యాచ్ విద్యార్థులు
ఎంపీ పసునూరి దయాకర్‌ను సన్మానించిన ప్రొ.దశరథరెడ్డి
సుల్తాన్‌బజార్ : విద్యార్థులుగా ఎంతో ఉత్సాహంగా విద్యను అందిపుచ్చుకున్న విద్యార్థులు సిల్వర్ జూబ్లీ వేడుకల ద్వారా ఒకే వేదికపై 25 ఏండ్ల అనంతరం కలుసుకోవడంతో వారి ఆనందాలకు అవదుల్లేవు. శనివారం మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్‌లో 1988వ బ్యాచ్‌కు చెందిన ఐప్లెడ్ ఆర్ట్ పెయింటింగ్, స్ల్కప్చర్ పూర్వ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు. ఈ కళాశాలలో 1988వ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి తన మనోభావాలను వెలిబుచ్చారు. నాడు చదువుకునే సమయంలో తోటి విద్యార్థులతో పోటాపోటీగా వ్యవహరిస్తూ సమస్యల కోసం ఉద్యమించిన సందర్భాలను ఆయన నెమరు వేసుకున్నారు. కళాశాల మాజీ ప్రిన్సిపాల్, రెడ్డి జన సంఘం సలహాదారులు ప్రొఫెసర్ కంచర్ల దశరథరెడ్డి మాట్లాడుతూ.. తాను ప్రిన్సిపాల్‌గా అయిన నాటి నుంచి కళాశాల అభివృద్ధే ధ్యేయంగా పని చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రొఫెసర్ గీతా, అసోసియేట్ ప్రొఫెసర్ కొడాలి సుందర్‌కుమార్, గంగాధర్, తెలంగాణ విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కె.మహిపాల్‌రెడ్డితోపాటు పూర్వ విద్యార్థులు, జబర్ధస్త్ ఫేమ్ కార్తీక్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...