ఇంటింటా సభ్యత్వ నమోదు చేపట్టాలి


Sun,July 14, 2019 12:04 AM

బండ్లగూడ: ఇంటింటికి వెళ్లి టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదును అందజేయడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ నాయకులు పనిచేయాలని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తాలో రంగారెడ్డి జిల్లా లీగల్‌సెల్ యాసిన్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ రంజిత్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్జి గౌండ్ల నాగేందర్‌గౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి సభ్యత్వ నమోదు తీసుకోవాలని సూచించారు.ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మలిదశ ఉద్యమం నుంచి పోరాటాలు చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకోవడంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిరుపేదల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నా రు. అందువల్లే రెండోసారి కూడా తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారన్నారు. అనంతరం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇతర పార్టీలకు తావుండకుండా టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదును తీసుకునేలా నాయకులు చర్య లు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో రైతులందరికీ పంట సహయం కింద సంవత్సరానికి రూ.8 వేలు అంజేస్తున్నారన్నారు.

రైతుబీ మా పథకంతో రైతులు పంట నష్టాలతో ఇ బ్బందులు ఎదుర్కొకుండా లేదా రైతు అనుకోని పరిస్థితుల్లో మృతి చెందితే రైతు కుటుంబసభ్యులకు బీమాతో ఆర్థిక సాయం అందజేస్తున్నారన్నారు. మిషన్ భగీరథతో అన్ని గ్రామాల్లో తాగునీరు అందిస్తుందన్నారు. ఇంతటి ఘనత సాధిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ప్రజలందరూ సభ్యత్వ నమోదును తీసుకొని అం డగా నిలవాల్సిన అవసరముందన్నారు. రంగారెడ్డి జిల్లా సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్జి గౌండ్ల నాగేందర్‌గౌడ్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదును ఉద్యమంలా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా లీగల్‌సెల్ అధ్యక్షుడు మహ్మద్ యాసిన్ అయ్యుబీ, కేఎంఆర్ చైర్మన్ ముసా సి ద్ధికి, రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకుడు ముఖీద్ చందా, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడ సరికొండ వెంకటేశ్, షౌకత్, మునీరాబేగం, ముజమిల్ అహ్మద్, రాజేష్, దుర్గేష్, రాపోలు సత్తయ్య, పొరెడ్డి ధర్మారెడ్డి, కె. సత్యనారాయణ గౌడ్, శ్రీవర్ధన్‌రెడ్డి, రజినీగౌడ్, స్వర్ణగౌడ్, గోపాల్ ముదిరాజ్ తదితరులు, శ్రీను, జనార్దన్, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...