రాష్ర్టాభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం


Sun,July 14, 2019 12:04 AM

అబిడ్స్: రాష్ర్టాభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసా ని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని జుమ్మెరాత్ బజార్ లాలాభవన్‌లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత ఐదున్నర సంవత్సరాలుగా రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మినీఇండియాగా పేర్గాంచిన గోషామహల్ నియోజకవర్గంలో అన్ని రాష్ర్టాలకు చెందిన ప్రజలు నివాసముంటారని తెలిపారు. ఈ నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యే లేకున్నా రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడం వల్ల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు. గోషామహల్ నియోజకవర్గంలో 300 సంవత్సరాల నాటి మిర్చి మార్కెట్‌ను తమ ప్రభుత్వం ఆధునీకరించి నిర్మాణం చేపడుతున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ అందరి పార్టీ అని, పార్టీలో సభ్యత్వం తీసుకునేందుకు అందరు ముందుకురావాలని కోరారు. ముఖ్యమంత్రి అన్ని కులాలు, మతాల వారికి ప్రాధాన్యత కల్పిస్తూ అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను చేపడుతున్నారని పేర్కొన్నారు. కార్పొరేటర్లు బాధ్యతగా సభ్యత్వ నమోదును పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జిన్నారం వెంకటేష్‌గౌడ్, ప్రేమ్‌సింగ్‌రాథోడ్, నందకిషోర్ వ్యాస్, ముఖేష్‌సింగ్, పరమేశ్వరీసింగ్, సంతోష్ గుప్తా, గోవింద్‌రాఠి, ధన్‌రాజ్, అందె లక్ష్మణ్‌రావు, ప్రకాష్, జైశంకర్, మాడిశెట్టి సదానందం గుప్తా, బెజిని శ్రీనివాస్, ఆనంద్‌సింగ్, శాంతిదేవి, ప్రియాగుప్తా, విశ్వ ప్రేమ్, వీరుసింగ్, నిర్మల్‌యాదవ్, కోటి శైలేష్ కురుమ, హరీష్ గుప్తా, మన్నుసింగ్, రమేష్‌సింగ్, దత్తు, సంతోషి సింగ్, ఆశీష్, ఓం ప్రకాష్, సుశీల్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...