సభ్యత్వ నమోదు లక్ష్యాలను 20లోగా చేరుకోవాలి


Sun,July 14, 2019 12:03 AM

-సమగ్ర వివరాలతో సభ్యత్వ నమోదు చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌దే
-తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేదు
-మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
బంజారాహిల్స్, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదులో భాగంగా ఇచ్చిన లక్ష్యాలను ఈనెల 20లోగా పూర్తిచేసేందుకు ఆయా డివిజన్ల నాయకులు, కార్యకర్తలు, నాయకులు కృషిచేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సూచించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేసే ఉద్దేశంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారాహిల్స్ డివిజన్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి తలసాని మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుగుతోందని, ఎక్కడ చూసినా కార్యకర్తలు ఉత్సాహంగా సభ్యత్వాలను తీసుకుంటున్నారన్నారు. గతంలో అనేక రాజకీయ పార్టీలు సభ్యత్వాలు చేయించినప్పటికీ ప్రస్తుతం టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదుకు సాటిరావన్నారు. ప్రతి కార్యకర్తకు సంబంధించిన వివరాలను నమోదు చేయడంతోపాటు ఆధార్ కార్డు నెంబర్‌ను సేకరిస్తూ సమగ్రమైన రీతిలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోందన్నారు. గతంలో డబ్బులు తీసుకోకుండానే కొన్ని పార్టీలు లక్షల సభ్యత్వాలు ఇచ్చాయని, పార్టీ అకౌంట్లో మాత్రం సభ్యత్వ నమోదు ద్వారా వచ్చిన డబ్బులు అంటూ లెక్కలు చూపారని ఆరోపించారు.

ఇటీవల ఎన్నికల సమయంలో ఓ పార్టీకి చెందిన రూ.7కోట్లు పట్టుబడ్డప్పుడు ఆ డబ్బు సభ్యత్వాలకు చెందినది అని చెప్పారని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీపై ప్రజ ల్లో ఆదరణ ఏ మాత్రం తగ్గలేదని, గాలివాటంగా బీజేపీకి కొన్ని సీట్లు రావడంతో ప్రత్నామ్నాయం తామే అంటూ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ కలలు కల్లలుగానే మిగిలిపోతాయని, తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న టీఆర్‌ఎస్ పార్టీ వెం టనే ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. రానున్న బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అమ్మవారి ఆలయాలకు నిధులు ఇస్తున్నదని, పండుగకు ఆరు రోజు లు ముందుగానే బోనాల నిధులు ఆలయాల అకౌంట్లలోకి వచ్చేలా చూస్తున్నామన్నారు. ఈ నిధులను సక్రమం గా వినియోగించుకుని అమ్మవారి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలన్నారు. అన్ని మతాలను సమానంగా చూ స్తూ ఆలయాలను అభివృద్ధి చేస్తున్నది టీఆర్‌ఎస్ పార్టీ అయితే బీజేపీ మాత్రం మతం పేరుతో రాజకీయాలు చేస్తుందన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ నిర్దేశిత గడువులోగా సభ్యత్వాలను పూర్తిచేస్తామని, పార్టీ కార్యకర్తలంతా ఎంతో ఉత్సాహంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నారని వివరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్, బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...