చూసొద్దాం.. ఆస్వాదిద్దాం..


Sat,July 13, 2019 01:33 AM

-ప్రకృతి అందం..పర్యాటకానికి తలమానికం..
-మాన్‌సూన్‌లో మధ్యప్రదేశ్ టూర్
-పురాతన కట్టడాలు.. పార్కులు, దేవాలయాలు
-సందర్శకులను విపరీతంగా ఆకట్టుకునే ప్రాంతం ఖజురహో
-ఇండో -ఆర్యన్ శిల్పకళకు అద్దం పట్టేలా నిర్మాణాలు
-ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించిన ఆ రాష్ట్ర టూరిజం బోర్డు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మధ్యప్రదేశ్‌కు రండి.. పర్యాటకాన్ని ఆస్వాదించండి అంటూ మధ్యప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పిలుపునిచ్చింది. చారిత్రక వారసత్వ కట్టడాలు... వైవిధ్యభరితమైన దేవాలయాలు.. జాతీయ పార్కులు..మ్యూజియాలు.. అద్భుత ఆకృతిగల కొండలు.. జలపాతాలు.. పర్యాటకుల మనసుదోచే సంపద మధ్యప్రదేశ్‌లో పుష్కలంగా ఉన్నాయి. మాన్‌సూన్‌లో మధ్యప్రదేశ్ పర్యాటక సొగసులను మిస్ కావొద్దంటూ.. అక్కడి టూరిజం డిపార్ట్‌మెంట్ ప్రత్యేక ప్యాకేజీలను సైతం ప్రకటించింది. ఈ సందర్భంగా తాజ్‌దక్కన్‌లో శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని పర్యాటక ప్రాంతాల వివరాలను టూరిజం బోర్డు డిప్యూటీ డైరెక్టర్ యువరాజ్ పడోల్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌కు రోడ్డు, రైలు, వాయు మార్గాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. దేశంలోనే అత్యంత వైవిధ్యభరితమైన ఆలయాలు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయని వెల్లడించారు. విదేశీ పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ప్రాంతం మధ్యప్రదేశ్ అని చెప్పారు. గతేడాది రూ.8.5 కోట్ల పర్యాటకులు రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించారని పేర్కొన్నారు. ప్రపంచ వారసత్వ కట్టడమైన ఖజురహో, గ్లావియర్, సాంచీ, డేటీయ, చండేరీ, భీమ్‌బెట్కా తదితర కట్టడాలకు ఎంతో చరిత్ర ఉందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించాల్సిన అవసరముందని వివరించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ మధ్యప్రదేశ్‌ను సందర్శించినట్లు వివరించారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ఇక్కడి ప్రజలకు పర్యాటకంపై అమిత ప్రేమ ఉంటుందన్నారు. అందుకే ఇక్కడి వారి కోసం ప్యాకేజీలు రూపొందించామని వెల్లడించారు. పర్యాటకుల సంఖ్యను పెంచి మధ్యప్రదేశ్‌ను పర్యాటక అనుకూల ప్రాంతంగా అభివృద్ధి చెయాలని భావిస్తున్నామని చెప్పారు. అత్యధిక అడవులున్న రాష్ర్టాల్లో మధ్యప్రదేశ్ ఒకటన్నారు. సాంస్కృతికంగా ఖజురహో నృత్య ఫెస్టివల్, మాల్వా ఉత్సవ్, తాన్‌సేన్ ఫెస్టివల్, అల్లాదిన్ మ్యూజిక్ ఫెస్ట్‌లను నిర్వహిస్తున్నామని చెప్పారు. పచ్‌మరీ మాన్‌సూన్ మారథాన్, గో హెరిటేజ్ రన్, సైకిల్ సఫారీ, నర్మద నది వద్ద అడ్వెంచర్ యాక్టివిటీస్ ప్రారంభిస్తున్నామని యువరాజ్ పడోల్ తెలిపారు.
ప్యాకేజీలు ఇలా
జ్యోతిర్లింగాల దర్శనం- ఓంకారేశ్వర్, మహేశ్వర్, మండూ, ఉజ్జయినీ ఆలయాల సందర్శన(5రోజులు)
నేచర్ ట్రయల్ ప్యాకేజీ- నాగ్‌పూర్-పెంచ్, పచ్‌మర్చి(3రోజులు
సప్తపూర క్వీన్ ప్యాకేజీ- భోపాల్-పాచ్‌మర్చి, సాంచి(5రోజులు)
నేచర్ అండ్ టైగర్ ప్యాకేజీ- జబల్‌పూర్-బందవ్‌ఘర్హ్-బీద్‌ఘాట్(4రోజులు)
టైగర్ కాలింగ్ - నాగ్‌పూర్-కన్హా(3 రోజులు)
హెరిటేజ్ ప్యాకేజీ -గ్వాలియర్-ఓర్చా, ఖజురహో, ఝాన్సీ (5 రోజుల ప్యాకేజీ)

మరిన్ని వివరాలకు..
మధ్యప్రదేశ్ పర్యాటకాన్ని సందర్శించాలని ఆసక్తి ఉన్న టూరిస్టులు బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఉన్న మధ్యప్రదేశ్ స్టాల్ ఫోన్ నంబర్ 040-23407785, 9951080605, 9866069000, 9302460027 లను సంప్రదించొచ్చు. మధ్యప్రదేశ్ టూరిజం హెల్ప్‌లైన్ 0755-2550588కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...