విలేకరిపై దాడికి పాల్పడిన సెక్యూరిటీ గార్డుల తొలగింపునకు చర్యలు


Sat,July 13, 2019 01:27 AM

సుల్తాన్‌బజార్: ద్విచక్రవాహనంపై వెళుతున్న విలేకరి పొన్న శ్రీనివాస్ శుక్రవారం ఉదయం పుత్లీబౌలి సమీపంలోని బగ్గా వైన్స్ ఎదురుగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కాగా ఉదయం పది గంటలకు వార్తా సేకరణల నిమిత్తం విలేకరి శ్రీనివాస్ తన నివాసం రామాంతపూర్ నుంచి బయలుదేరి ఛాదర్‌ఘాట్ మీదుగా ఎంజే మార్కెట్ వైపు వెళుతున్న క్రమంలో బగ్గా వైన్స్ వద్దకు చేరుకోగానే గుర్తు తెలియని ద్వి చక్ర వాహనం వెనుక నుంచి ఢీ కొట్టడంతో శ్రీనివాస్ చేతి కణితి వెముక విరిగింది.ఈ మేరకు స్థానికులు గాయపడిన విలేకరిని చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానాకు తరలించారు. ఈ ప్రమాదంలో ఎన్‌టీవీ విలేకరి చేతి కణితి వెముక విరగడంతో వైద్యులు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం శస్త్ర చికిత్స నిర్వహించారు. విలేకరి రోడ్డు ప్రమాదంలో గాయపడిన విష యం తెలుసుకున్న తోటి విలేకర్లు, ఐజేయూ, బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు శ్రీనివాస్‌ను పరామర్శించారు. శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఉస్మానియా దవాఖానాలో చికిత్స పొందు తున్న విషయాన్ని తెలుసుకున్న తోటి విలేకరులైన గిరిబాబు దవాఖానాకు చేరుకొని తన ద్విచక్రవాహనాన్ని నిలిపి వెళ్ళే క్రమంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులు గిరిబాబును ద్విచక్రవాహనాన్ని అక్కడ నిలపవద్దని వారించారు.ఇతరుల వాహనాలు అక్కడ ఉన్నాయి కదా తన వాహనం నిలిపితే ఏమవుతందని సెక్యూరిటీ గార్డులతో అనడంతో గార్డులు అంతటితో ఆగకుండా విలేకరి గిరిబాబుతో వాగ్వాదానికి తోసివేశారు.ఈ విషయమై దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ప్రత్యేక కమిటీని వేసి విలేకరి గిరిబాబుపై దాడికి పాల్పడిన ఆరుగురు సెక్యూరిటీ గార్డులను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇం దుకు గాను ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇటువంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపడుతా మని దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ వివరించారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...