బల్దియా ప్రాజెక్టుల వేగవంతానికి చర్యలు


Sat,July 13, 2019 01:26 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బల్దియా ఆధ్వర్యంలో చేపడుతున్న ైఫ్లెఓవర్లుసహా వివిధ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా భూసేకరణ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా భూసేకరణ విభాగాన్ని పర్యవేక్షించడంతోపాటు రెవిన్యూ విభాగంతో సమన్వయం చేసు కునేందుకు ప్రత్యేకంగా ఓ అదనపు కమిషనర్‌ను నియమించనున్నారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ), నాలాలు, రహదారుల విస్తరణ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం తదితర ప్రాజెక్టులకు అవసరమయ్యే భూమి, ఆస్తుల సేకరణ పురోగతిపై శుక్ర వారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ దానకిషోర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రేటర్ పరిధిలో దాదాపు రూ. 25 వేలకోట్ల వ్యయంతో ఎస్‌ఆర్‌డీపీ, రూ. 10వేల కోట్లతో స్ట్రామ్ వాటర్ డ్రెయిన్, నాలా లు, రహదారుల విస్తరణ తదితర పనులు జరుగుతున్నాయని, ఇవి సజా వుగా సాగాలంటే భూసేకరణ త్వరితగతిన పూర్తికావాలని చెప్పారు. అందుకే ప్రస్తుతమున్న అడ్డంకులను అధిగమించేందుకు న్యాక్ నుంచి జీహెచ్‌ఎంసీలో నియమితులైన 20మంది ఇంజినీర్లు, 10మంది సర్వేయర్లు, ఒక విశ్రాంత స్పెషల్ డిప్యుటీ కలెక్టర్, ఒక విశ్రాంత పోలీసు అధికారి, సర్వే-లాండ్స్ రికార్డ్స్ డైరెక్టర్ తదితరులతో ప్రత్యేకంగా భూసేకరణ విభాగాన్ని ఏర్పాటుచేయాలని నిశ్చయించినట్లు, దీనికి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయా లని అధికారులను ఆదేశించారు. దీనివల్ల సర్వే, అంచనాల తయారీ, నోటి ఫికేషన్ల జారీ తదితర పనులు వేగవంతమవుతాయని చెప్పారు. ఆయా ప్రాజెక్టుల్లో సేకరణకోసం గుర్తిం చిన ఆస్తులన్నింటినీ ఒకేసారి నోటిఫై చేసే వీలు కలుగుతుందన్నారు. భూసేకరణ దశల వారీగా కాకుండా ఒకేసారి చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ భూములను సైతం ప్రైవేటు వ్యక్తులు తమదిగా పేర్కొంటూ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పలువురు అధికారులు కమిషనర్ దృష్టికి తేవడంతో కమిషనర్ స్పందిస్తూ, ఆయా ప్రభుత్వ భూములకు సంబంధించి ముందుగానే న్యాయస్థానాల్లో కేవియట్ వేయాలని సూచించారు. చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్‌రావు, చీఫ్ ఇంజినీర్ శ్రీధర్, జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...