డీజీపీ మహేందర్‌రెడ్డి నేతృత్వంలో ఓఎస్‌సీసీ భేటీ


Sat,July 13, 2019 01:26 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఆయిల్, గ్యాస్ సరఫరా వాటి భద్రతపై తీసుకోవాల్సిన పటిష్ట చర్యలపై డీజీపీ మహేందర్‌రెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న అన్ షోర్ సెక్యూరిటీ కో అర్డినేషన్ కమిటీ (ఓఎస్‌సీసీ) రెండో సమావేశం డీజీపీ కార్యాలయంలో గురువారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో ఏర్పడిన ఈ కమిటీకి గేల్ సంస్థ సలహాదారు ప్రమోద్‌కుమార్ కన్వీనర్‌గా ఉన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర అదనపు డీజీపీలు, కమి షనర్లు, ఇంటలిజెన్స్, కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారాలతో పాటు వివిధ గ్యాస్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అయిల్, గ్యాస్ దొంగతనాలకు జరగకుండా, సరఫరాలో ఎలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు. గ్యాస్, ఆయిల్ సరఫరాలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఆయా కంపెనీలు తగిన జాగ్రత్తలు తీసు కోవాలని సూచించారు. ఎక్కడైనా ఎదైన అనుమానాస్పద సంఘటన జరుగుతుందని సమాచారం వస్తే ఆయా కంపెనీల సంస్థల ప్రతినిధులు, సిబ్బంది పోలీసులతో సమాచా రాన్ని పంచుకోవాలని డీజీపీ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న కొత్త ప్రాజెక్టులపై కూడా ఈ కమిటీ సమావేశంలో చర్చించారు. చర్లపల్లి ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచాలని రాచకొండ సీపీ నేతృత్వంలో మల్కాజిగిరి డీసీపీకి బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది జనవరి నెలలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాంపల్లి ప్రాంతంలో డీజీల్, పెట్రోల్ చోరికి సంబంధించిన అతి పెద్ద కేసును ఛేదించారని ఇండియన్ అయిల్ కార్పొరేషన్ తెలంగాణ, ఏపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భరద్వాజ్ అభినం దించారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణ పోలీసులు ఇలాంటి కేసును ఛేదించిన ఘనత దక్కించుకున్నారన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...