విద్యా లక్ష్మీ కటాక్షం


Fri,July 12, 2019 01:59 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఉన్నత విద్య, విదేశాల్లో చదువు కోసం గతంలో విద్యార్థులు రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. సిఫార్సులు, ఆస్తిపాస్తులు, ఉద్యోగ పూచీకత్‌లు సమర్పించాల్సి వచ్చేది. అయినా రుణం మంజూరు అవుతుందో లేదో తెలియని పరిస్థితి. పేద, మధ్యతరగతి వర్గాలకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విద్యాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం 2015-16 బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. అప్పట్నుంచి ఏటా కేటాయింపులు జరుగుతూనే ఉన్నాయి. చదువు వివరాలు వాస్తవికతతో కూడి ఉంటే చాలు రుణం పొందడం తేలికే. చాలా మందికి ఈ పథకంపై అవగాహనలేక సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. విద్యా రుణం పొందాలంటే బ్యాంకుల చుట్టూ తిరుగాలనే అపోహ ఉన్నది. ఆ అవసరం లేకుండా ఇంటి నుంచి దరఖాస్తు చేసుకుని రుణం పొందే అవకాశం ఈ పథకం కల్పిస్తున్నది. కేంద్ర ఆర్థిక శాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్(ఏబీఏ) సంయుక్తంగా విద్యాలక్ష్మి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఎన్‌ఎస్‌డీఎల్ ఈ-గవర్నెన్స్ వ్యవస్థ ద్వారా ఈ పథకాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఏయే చదువులకు..?
ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, మెడిసిన్, పీజీ డిప్లొమా ప్రొఫెషనల్ కోర్సులు, కాస్ అకౌంటెన్సీ, చార్టెడ్ అకౌంట్, ఐఐఎం మేనేజ్‌మెంట్, ఐఐటీ, వృత్తి విద్యా కోర్సులు, విమానయాన రంగానికి సంబంధించిన కోర్సులు చదివే వారికి రుణాలు ఇస్తారు. యూజీసీ, ఎఐసీటీఈ ఇతర ప్రభుత్వ అధీకృత సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వారికి రుణాలు అందుతాయి.

బ్యాంకుల ద్వారా..
ఈ పోర్టల్‌లో 36 బ్యాంకులు నమోదయ్యాయి. అవి విద్యా రుణాలను అందిస్తున్నాయి. ఎస్‌బీఐ, కెనరాబాయక్, విజయ, ఐవోబీ, యూనియన్, ఆంధ్రా బ్యాంక్, ఐడీబీఐ, యూబీఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, యూకో, దీనా, కరూర్‌వైశ్య, సిండికేట్, టీఏఏబీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, యాక్సిస్, ఫెడరల్, న్యూఇండియా, అలహాబాద్, ఆర్‌బీఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకుల నుంచి నేరుగా రుణాలను పొందవచ్చు.

దరఖాస్తు చేసే విధానం..
విద్యా రుణం కోసం మూడు పద్ధతుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటగా విద్యాలక్ష్మి పోర్టల్ నమోదు కావాలి. తర్వాత వివరాలతో కూడిన దరఖాస్తు పూరించాలి. చివరగా వివిధ రకాల బ్యాంకులను ఎంపిక చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయితే రుణానికి సంబంధించిన వివరాలు మొబైల్, ఈ-మెయిల్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...