ప్రధాన రోడ్ల విస్తరణకు గ్రీన్ సిగ్నల్


Fri,July 12, 2019 01:56 AM

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ: నగరంలోని పలు ప్రధాన రోడ్ల విస్తరణకు బల్దియాస్థాయీసంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఛేనెంబర్ ైఫ్లెఓవర్ నిర్మాణం వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ మార్గంలో ప్రత్యామ్నాయ రోడ్డును అభివృద్ధిచేస్తున్నారు. అంబర్‌పేట్‌లోని అలీకేఫ్ నుంచి పటేల్‌నగర్ ఎస్‌టీపీ, నాగోల్ మెట్రో స్టేషన్,మెట్రో మాల్ మీదుగా ఉప్పల్ నల్లచెరువు వరకు రోడ్డును 150అడుగులమేరకు విస్తరించాలని నిర్ణయించారు. దీంతోపాటు పలు ముఖ్యమైన రోడ్ల విస్తరణకు గురువారం బల్దియా స్థాయీసంఘం ఆమోదం తెలిపింది.

మేయర్ బొంతు రామ్మోహన్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు. అందులో టోలీచౌకీ ైఫ్లెఓవర్ లిమ్రా హోటల్ నుంచి మహ్మదీయ లైన్, ఆంధ్రా ఫ్లోర్‌మిల్, మిలటరీ ఏరియా మీదుగా గోల్కొండ మోతి దర్వాజ వరకు రోడ్డును 18మీటర్ల వెలడ్పుకు విస్తరించాని తీర్మానించారు. అలాగే, బంజారా దర్వాజానుంచి తెలంగణ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ జూనియర్ కాలేజ్ వరకు 30మీటర్లు, కేపీహెచ్‌బీ ైఫ్లెఓవర్ నుంచి భరత్‌నగర్ రైల్వే గూడ్స్ షెడ్ వరకు 45మీటర్లు, చందానగర్ రైల్వే స్టేషన్ నుంచి వెంకటేశ్వరనగర్ సౌత్ లేఅవుట్ వరకు, చందానగర్ రైల్వే స్టేషన్ నుంచి వైశాలినగర్ నార్త్ వరకు 30మీటర్లు, గచ్చిబౌలీ నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మీదుగా బీహెచ్‌ఈఎల్ జంక్షన్ వరకు 45మీటర్లమేరకు రోడ్డు విస్తరణ చేయాలని తీర్మానించారు.

స్థాయీసంఘంలో కొన్ని ముఖ్య తీర్మానాలు.....
- వనస్థలిపురం క్రాస్‌రోడ్ సుష్మా థియేటర్ నుంచి మన్సూరాబాద్ పెద్ద చెరువు వరకు రూ. 10.50కోట్లతో వరదనీటి బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి ఆమోదం
- కామినేని జంక్షన్ నుంచి అలకాపురి జంక్షన్ వరకు రూ. మూడు కోట్లతో వరదనీటి బాక్స్ డ్రెయిన్ నిర్మాణం
- బేగంబజార్ హోల్‌సేల్ చేపల మార్కెట్‌లో అసంపూర్తిగా ఉన్న రెండో అంతస్తు, టెర్రస్ ఫ్లోర్ నిర్మాణానికి రూ. 4.10కోట్లు మంజూరు
- హస్తినాపురం దేవకీ ఎన్‌క్లేవ్ నుంచి సీవరేజ్ మెయిన్ లైన్ వరకు 800ఎంఎం వ్యాసార్థం గల సీవరేజ్ లైన్ నిర్మాణానికి రూ. 3.00కోట్లు మంజూరు
- కీసర మండలం రాంపల్లి గ్రామంలో జీహెచ్‌ఎంసీ నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కాలనీలో ఈ ఏడాది జనవరి 31న ప్రమాదవశాత్తూ మరణించిన ఐదుగురు కార్మికులకు రూ. 10లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు
- 2019-20ఆర్థిక సంవత్సరంలో బల్దియా వాహనాలకు టైర్లు,ట్యూబ్‌లు, ముడి చమురు, బ్యాటరీలు తదితర కొనుగోలుకు రూ. 2.95కోట్లు మంజూరు
- టోలీచౌకీ, బంజారా దర్వాజా, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ, చందానగర్, గచ్చిబౌలీ, అంబర్‌పేట్ అలీ కేఫ్ తదితర రోడ్ల విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...