300 మందికి టీఆర్‌ఎస్ సభ్యత్వం..


Fri,July 12, 2019 01:55 AM

ఎల్బీనగర్, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని నాగోలులోని కార్యాలయంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాస్ గుప్త ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సుమారు 300 మందికి టీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ దేశంలోని అన్ని పార్టీలకు దిక్సూచిగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కేంద్రంలోని ప్రభు త్వా లకే కాక ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వైశ్యులకు పెద్దపీట వేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింద న్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ న్యాయకత్వంలో పార్టీ అన్ని ప్రాం తాల్లో బలోపేతంగా మారిందన్నారు. ఉప్పల శ్రీనివాస్ చేతుల మీదుగా సభ్యత్వం తీసుకున్న వారిలో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ పోలిటికల్ కమిటీ ఛైర్మన్ బచ్చు శ్రీనివాస్‌గుప్త, రాష్ట్ర కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కూర నాగరాజు, వాసవి కిరణాలు పత్రిక సంపాదకులు సోమ త్రినాథ్, హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి న్యాల మాడుగుల మురళికృష్ణ, కోశాధికారి గంది వెంకటేశ్వర్లు, యూత్ కోఆర్డినేటర్ నరేష్‌గుప్త, నాగోలు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పోతుగంటి ప్రవీణ్, దాచేపల్లి బిక్షపతి, ఉప్పల బాబు, మంచాల శ్రీనివాస్ పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...