మరుభూమికి మహర్దశ


Wed,July 10, 2019 12:32 AM

కాప్రా: కాప్రా డివిజన్ పరిధిలోని అమ్ముగూడ శ్మశానవాటికలో రూ.87లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. రెండు విడతలుగా నిధులు మంజూరుకాగా, గత ఏడాది చేపట్టిన మొదటి విడత పనులు పూర్తయి, ఈ ఏడాది చేపట్టిన రెండవ విడత పనులు కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమస్యాత్మకంగా ఉన్న శ్మశాన వాటికలను అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకొంది. అందుకు అనుగుణంగా కాప్రాడివిజన్ కార్పొరేటర్ స్వర్ణ రాజు శ్మశానవాటిక సమస్యలను జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో దీని అభివృద్ధికి రెండు విడతలుగా నిధులు మంజూరయ్యాయి. పనులు తుది దశకు చేరుకోవడంతో శ్మశానవాటిక రూపురేఖలు మారిపోయాయి. శ్మశానవాటిక అభివృద్ధిలో భాగంగా గత ఏడాది చేపట్టిన మొదటి దశలో రూ.32లక్షలతో శ్మశానవాటికకు అప్రోచ్‌రోడ్డు, బర్నింగ్‌ప్లాట్‌ఫామ్‌ల ఆధునీకరణ, వాష్‌రూమ్, డ్రెస్‌చేంజింగ్ రూమ్, వెయిటింగ్‌హాల్ పనులు చేపట్టగా, ఈ ఏడాది రూ. 48లక్షలతో శ్మశానవాటికలో మెయిన్‌రోడ్డుతో పాటు ఎనిమిది అంతర్గత సీసీ రోడ్లపనులు చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు జరుగుతున్నాయి. శ్మశానవాటికకు మూడువైపులా (వలువర్‌నగర్, యాప్రాల్, కందిగూడలవైపు) మూడు గేట్లు ఏర్పాటు చేశారు. ఎగువప్రాంతంలోని కాలనీల నుంచి వచ్చే డ్రైనేజీవల్ల శ్మశాన వాటికలో సమస్యలు ఏర్పడుతున్నందువల్ల దాన్ని మళ్లించేందుకు రూ. ఏడు లక్షలతో వేరుగా రెయిన్‌బోకాలనీ వరకు డ్రైనేజీ లైను వేసినట్టు కార్పొరేటర్ స్వర్ణ రాజు తెలిపారు. అంతేకాకుండా రాత్రివేళల్లో జరిపే అంత్యక్రియలకు ఇబ్బం దులు కలుగకుండా మొత్తం 50 ఎలక్ట్రికల్ స్తంభాలు, వాటికి ఎల్‌ఈడీ లైట్లు, శ్మశానవాటిక మద్యలో హైమాస్ట్‌లైట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...