స్టార్టప్..ఔత్సాహికులకు పుష్‌అప్!


Tue,July 9, 2019 01:02 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఆలోచన ఉంటే చాలు..స్టార్టప్‌లతో వ్యాపారవేత్తలుగా ఎదుగొచ్చు. తెలంగాణలో స్టార్టప్‌ల స్థాపనకు అనేక సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తున్నది. సింహభాగం ఉద్యోగాలు స్టార్టప్‌లతోనే భర్తీ కానున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఇన్నోవేషన్, టీ హబ్ ఏర్పాటుతో దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచింది. ఇక్కడి ప్రభుత్వం స్టార్టప్‌లకు ఇస్తున్న ప్రోత్సాహంపై కేంద్ర మంత్రులు సైతం ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. స్టార్టప్‌ల ప్రాముఖ్యత తెలుసుకున్న కేంద్ర సర్కార్ కూడా బడ్జెట్‌లో ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను ప్రోత్సహించడానికి కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఏంజెల్ ట్యాక్స్ విషయంలో స్టార్టప్‌లకు ఎదురవుతున్న ఇబ్బందులతో చాలా మంది ఔత్సాహికులు స్టార్టప్‌ల ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. అందులో భాగంగానే ఆదాయ పన్ను తనిఖీల నుంచి స్టార్టప్‌లకు మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పెట్టుబడిదారులు, వారి పెట్టుబడుల మూలాలను గుర్తించడంలో ఎదురవుతున్న సమస్యను పరిష్కరించేందుకు ఈ -వెరిఫికేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీంతో స్టార్టప్‌లు సమీకరించే నిధులపై ఆదాయపన్ను విభాగం ఎలాంటి తనిఖీలు జరుపాల్సిన అవసరం ఉండదు. అయితే స్టార్టప్‌లకు కేంద్రం కల్పించిన ఊరటపై ఎంటర్‌ప్రెన్యూర్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

స్టార్టప్ టీవీ తో ప్రయోజనం లేదు..
ఐదేండ్లలో చాలా స్టార్టప్‌ల గురించి మాట్లాడారు. కానీ అవన్నీ ఫెయిల్ అయ్యాయి. స్టార్టప్ టీవీ ఏర్పాటుతో పెద్దగా ఏమీ ప్రయోజనాలు ఉండవు. గతంలో స్టార్టప్‌లకు పది వేల కోట్లు ఫండ్ అన్నారు. దాని ఊసేలేదు. ప్రతి ఏడాది బడ్జెట్‌లో స్టార్టప్ ఫండ్ అంటూ ఊదరగొడుతున్నారు. కానీ కార్యాచరణలో విఫలమవుతున్నారు. దీంతో ఇప్పటి వరకు స్టార్టప్‌ల ఫండ్‌తో బెన్‌ఫిట్ అయిన కంపెనీలు నాకు తెలిసి లేవు. స్టార్టప్‌లకు ఇంకా సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తే బాగుంటుంది.
-చెన్నప్ప నాయుడు దరపనేని, చైర్మన్, మేర ఈవెంట్

ఉద్యోగాలు వస్తాయి
ఇప్పటికే హైదరాబాద్‌లోని స్టార్టప్ కల్చర్ గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలుసు. ఇక్కడి ప్రభుత్వం స్టార్టప్‌ల స్థాపనకు ఎంత చేయాలో అంతా చేస్తున్నది. ఇన్వెస్ట్ చేసేవారు మీ దగ్గరకు వచ్చేలా స్టార్టప్‌లు ఉపయోగపడుతున్నాయి. ఇక్కడి ప్రజలకు ఐటీ పరంగా అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. అదే మన విజయం. ఇప్పటి వరకు ఎలాగైతే.. గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్‌లు హైదరాబాద్‌కు వచ్చాయో... అలాగే ప్రపంచానికి హైదరాబాద్ నుంచి కంపెనీలు ఏర్పాటు చేసే వ్యక్తులు తయారవ్వాలి. తెలంగాణలో ఉన్న స్టార్టప్‌లను ప్రభుత్వం ప్రోత్సహించడంపై అభినందనలు వస్తున్నాయి. స్టార్టప్‌లతో ఉద్యోగాలు మరిన్ని భర్తీ అయ్యే అవకాశం ఉంటుంది.
-రాజీవ్ చిలక, ఫౌండర్, గ్రీన్‌గోల్డ్ యానిమేషన్ లిమిటెడ్

హైదరాబాదే ఐకాన్..
గతంలో స్టార్టప్ ఇండియ, పాలసీలు అంటూ చాలా చెప్పారు. కానీ ప్రాక్టికల్‌గా వర్కవుట్ కాలేదు. స్టార్టప్ ప్రారంభించేటప్పుడు మేము కొన్ని వాల్యుయేషన్స్ ఇస్తాం. అయితే అది కొన్ని డిపార్ట్‌మెంట్లకు అర్థం కాదు. స్టార్టప్ ఇండియా అంటూ గతంలో చాలా పాలసీలు తీసుకొస్తున్నామని చెప్పారు. డ్రోన్స్, అర్టిఫీషియల్ రోబోటిక్స్ లాంటి ఎమెర్జింగ్ టెక్నాలజీని కూడా ముందుకు తెచ్చారు. మంత్రిగారు మాట్లాడటం వల్ల జనాలకు స్టార్టప్‌ల ఉపయోగం అర్థం అవుతుంది. స్టార్టప్‌ల గురించి మాట్లాడుతున్నారంటే తెలంగాణలో స్టార్టప్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం చేస్తున్న కృషియే కారణం. స్టార్టప్‌లకు ప్రత్యేక చానెల్ ఏర్పాటు చేయడం కూడా మంచి నిర్ణయమే.. కానీ కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అందుకు తగ్గ కార్యాచరణ కూడా అవసరం.
- ప్రేమ్ కుమార్ విస్లావత్, కో ఫౌండర్, రాస్తాస్టూడియో

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...